Bhopal, Feb 12: క్రిమినల్ కేసులు నమోదైనవారి ఇళ్లు, ఆస్తులను బుల్డోజర్‌తో కూల్చడం ఫ్యాషన్‌గా మారిందని (HC on Bulldozer Action) మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎలాంటి విధివిధానాలు లేకుండా చర్యలు తీసుకోవడం పురపాలక అధికారులకు ఫ్యాషన్‌గా మారిందని వ్యాఖ్యానించింది. ఓ కేసుకు సంబంధించి నిందితుడి భార్య హైకోర్టును (Madhya Pradesh High Court) ఆశ్రయించగా.. ఈమేరకు వ్యాఖ్యలు చేసింది.
మధ్యప్రదేశ్‌కు చెందిన రాహుల్ లంగ్రి అనే వ్యక్తిని ఓ ఆస్తి వివాదంలో మరో వ్యక్తి బెదిరించి దాడి చేశాడు. దీంతో ఆ బాధితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో రాహుల్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. అనంతరం పోలీసులు, పురపాలక అధికారులు కలిసి రాహుల్‌కు చెందిన రెండంతస్తుల భవనాన్ని కూలగొట్టారు. ఈ చర్యలపై రాహుల్ భార్య రాధ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
మునుపటి యజమాని రైసా బీ పేరు మీద నోటీసు ఇచ్చారని, మరుసటి రోజు ఏం చెప్పినా వినకుండా ఇంటిని ధ్వంసం చేశారని తన పిటిషన్‌లో పేర్కొంది. ఇల్లు చట్టవిరుద్ధం కాదని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇల్లు హౌసింగ్ బోర్డులో రిజిస్టర్ అయిందని, బ్యాంకు రుణం తీసుకున్నామని ఆమె తెలిపారు.కూల్చివేత చట్టవిరుద్ధమని జస్టిస్ వివేక్ రుషియా తీర్పునిస్తూ, రాధా లాంగ్రీ, ఆమె అత్తగారైన విమ్లా గుర్జర్‌లకు ఒక్కొక్కరికి రూ. 1 లక్ష చొప్పున పరిహారం అందించాలని కోర్టు ఆదేశించింది.కూల్చివేతలకు పాల్పడిన పౌర అధికారులపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. పిటిషనర్లు ఇప్పుడు అధిక పరిహారం కోసం సివిల్ కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు.