Pune Shocker: పూణెలో 11ఏళ్ల మైనర్ బాలికపై కన్నతండ్రి, అన్నయ్య 5 ఏళ్లుగా అత్యాచారం, ముక్కుపచ్చలారని చిన్నపిల్లపై కామవాంఛ తీర్చుకున్నారు దుర్మార్గులు..
Representational Image (Photo Credits: File Image)

Pune, March 20 :  ఒకే ఇంట్లో ఇద్దరు కామాంధులు 11సంవత్సరాల బాలికపై అత్యాచారం చేస్తూ వచ్చారు. కన్నకూతురు కదా అని తండ్రి చూడలేదు. తోడబుట్టిన సోదరి అనే భావనతో అన్నయ్య వ్యవహరించలేదు. ఇంతటి దారుణ ఘటన మహరాష్ట్ర( Maharashtra)లో జరిగింది. పూణె(Pune)లోని బండ్‌ గార్డెన్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఉంటున్న ఓ మైనర్ బాలికను తండ్రి(Father) సోదరుడే(Brother)రాక్షసుల్లా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బీహార్‌ (Bihar)నుంచి పూణెకి వలస వచ్చింది బాధితురాలు కుటుంబం. బాధితురాలు స్కూల్‌లో తోటి పిల్లలతో తన పట్ల తండ్రి, సోదరుడు వ్యవహరిస్తున్న తీరుపై ఫ్రెండ్స్‌తో చర్చించిన సమయంలో బయటపడింది.

11సంవత్సరాల బాలికపై(11year old girl) తండ్రి 2017నుంచి అంటే ఆరు సంవత్సరాల వయసు నుంచి శారీరకంగా వేధిస్తున్నట్లు పోలీసుల విచారణ తేలింది. అదే ఇంట్లో ఉంటున్న సోదరుడు సైతం 2020నుంచి బాలికను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు రాబట్టారు. ఇద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు మైనర్ బాలిక జీవితంతో ఆటలాడుకున్నారు. ముక్కుపచ్చలారని చిన్నపిల్లపై తమ కామవాంఛ తీర్చుకున్నారు దుర్మార్గులు.

పెరుగుతున్న పెగాసస్ బాధితులు, దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్, రాహుల్ గాంధీ, ప్రశాంత్‌ కిశోర్‌తో పాటు వందల కొద్ది నేతల ఫోన్లు ట్యాపింగ్, అసలు పెగాసస్‌ స్పైవేర్ అంటే ఏంటి

కన్నవాళ్లు, తోడ బుట్టిన వాడి పరిస్థితి ఇలా ఉంటే ఇంట్లో ఉండే తాతయ్య, దూరపు బంధువులు సైతం బాలికను ముట్టుకోకూడని చోట పట్టుకోవడం, చిన్నారి పట్ల అనుచితంగా ప్రవర్తించడం చేసేవాళ్లని బాధిత బాలిక పోలీసులకు తెలిపింది. మైనర్ బాలిక పట్ల ఇంత అమానవీయంగా ప్రవర్తించి తండ్రి, సోదరుడిపై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అశ్విని సత్పుటే ఇద్దరు కామాంధులపై కేసు నమోదు చేశారు. ఐపిసి సెక్షన్ 376 కింద తండ్రిపైన ..తాతయ్య , దూరపు బంధువుపై సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించారు.