Pune, March 27: పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలను తాకుతున్నాయి. రోజురోజుకి పెరిగిపోతున్న ఇంధన ధరలతో వాహనదారులు విలవిలలాడిపోతున్నారు. దీంతో అంతా ప్రత్యామ్నాయలపై దృష్టి పెట్టారు. పెట్రోల్ (Petrol), డీజిల్ (Desiel)కొనే పని లేని వాహనాలపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఎలక్ట్రిక్ బైక్ లను కొనుగోలు చేస్తున్నారు. వీటికి ఫ్యూయల్ అవసంర లేదు. ఛార్జింగ్ పెడితే చాలు. దీంతో ఒక్కసారిగా ఎలక్ట్రిక్ బైక్ (Electric) లకు ఆదరణ పెరిగింది. ఇటీవలి కాలంలో వీటి సేల్స్ విపరీతంగా పెరిగాయి. అయితే, కొన్ని సందర్భాల్లో ఎలక్ట్రిక్ బైక్స్ ప్రాణాంతకంగా మారుతున్నాయి. బాంబుల్లా పేలిపోతున్నాయి. బ్యాటరీలో మంటలు చెలరేగి కాలిపోతున్నాయి. వీటి కారణంగా నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. తాజాగా ఒకేరోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బైక్‌లు పేలిపోయాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
Ola Electric scooter catches fire on Pune. Reason unknown.
Credits: Electric Bike Wale. #OlaScooter #ola #olaelectric #motowagon #electricscooter pic.twitter.com/Zai55EnFZo
— MotoWagon (@motowagon360) March 26, 2022
పుణెలో ఓలా ఎస్ 1 (Ola Bike) ఎలక్ట్రిక్ బైక్ కాలిపోయింది. రోడ్డుపై వెళ్తుండగా బైక్‌లో మంటలు చెలరేగాయి. అయితే బైక్‌పై ఉన్న ప్రయాణికుడు దిగి పారిపోవడంతో ప్రాణాలు దక్కాయి. ఓలా బైక్ పేలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై ఓలా స్పందించింది. పేలుడుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పింది. గతంలో కూడా ఇలాగే ఓలా బైక్‌లో మంటలు చెలరేగాయి. ఇలా ఎలక్ట్రిక్ బైక్ లో మంటలు చెలరేగడం ఇది తొలిసారి కాదు.
మరోవైపు తమిళనాడు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బైక్ పేలి తండ్రి, కూతురు మృతి చెందారు.ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ బైక్ బాంబులా పేలిపోయింది. ఈ ఘటనలో తండ్రి, కూతురు మృతి చెందారు. వేలూరు(Vellore ) జిల్లాలోని అల్లాపురం ప్రాంతానికి చెందిన దురై వర్మ (49) కేబుల్ టీవీ ఆపరేటర్ గా పని చేస్తున్నారు. ఆయన కుమార్తె ప్రీతి (13) ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. రెండు రోజుల క్రితం దురై వర్మ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశాడు. శుక్రవారం రాత్రి స్కూటర్ కు ఛార్జింగ్ పెట్టి తండ్రి, కూతురు నిద్రించారు. ఇంతలో దారుణం జరిగింది. ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీలో (electric bike) మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత పేలిపోయింది.
కాగా, కొత్త ఎలక్ట్రిక్ బైక్‌తో పాటు పక్కనే పార్క్ చేసిన పెట్రోల్‌తో నడిచే మరో బైక్‌కు మంటలు అంటుకోవడంతో ఇల్లంతా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో తండ్రి, కూతురు మరణించారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. నిద్రపోతున్న తండ్రి, కూతురు ఎలక్ట్రిక్ బైక్ కారణంగా శాశ్వత నిద్రలోకి వెళ్లిపోవడంతో స్థానింగా విషాదం అలుముకుంది. కాగా, ఓవర్ ఛార్జింగ్ కారణంగా బైక్ పేలిపోయినట్లు తెలుస్తోంది.