Fire in Vaishali Express: యూపీలో గంటల వ్యవధిలో రెండు రైళ్లలో మంటలు, 29 మందికి తీవ్ర గాయాలు, ఢిల్లీ నుంచి బిహార్‌ వెళుతున్న రైళ్లలో మంటలు
Fire in Vaishali Express (photo-X)

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా (Etawah) జిల్లాలో ఢిల్లీ నుంచి బిహార్‌ వెళ్తున్న ఢిల్లీ- దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే అదే జిల్లాలో మరో రైల్లో మంటలు కలకలం రేపాయి. ఢిల్లీ నుంచి బిహార్‌లోని సహర్సా వెళ్తోన్న వైశాలి ఎక్స్‌ప్రెస్‌ (Vaishali Express)లోని ఎస్‌-6 బోగీ కాలిపోయింది. గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో.. మొత్తం 21 మందికి గాయాలయ్యాయి.

ఈ మేరకు సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఎస్-6 కోచ్‌లోని మంటలను ఆర్పేశారని పోలీసులు తెలిపారు. 21 మంది క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని వివిధ ఆస్పత్రులకు తరలించినట్లు వెల్లడించారు. గాయపడిన ప్రయాణికుల్లో 13 మందిని సైఫాయ్‌లోని ఆసుపత్రిలో చేర్చగా, ఏడుగురు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రథమ చికిత్స అనంతరం ఒక ప్రయాణికుడిని డిశ్ఛార్జి చేసినట్లు వెల్లడించారు.

వీడియో ఇదిగో, గాజాలో హమాస్‌ చీఫ్‌ ఇంటిపై బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్‌ సైన్యం, టెర్రరిస్టు కార్యకలాపాలకు నిలయమంటూ..

అంతకుముందు.. బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి బిహార్‌ వెళ్తున్న ఢిల్లీ- దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్‌-1 కోచ్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 3 బోగీలు దగ్ధమయ్యాయి. ఎనిమిది మంది స్వల్పంగా గాయపడ్డారు. అప్రమత్తమైన లోకో పైలట్‌ రైలును నిలిపేశారు.