Mumbai, Feb 27: టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ (Vinod Kambli) అరెస్టయ్యారు. మద్యం మత్తులో ఓ కారును ఢీకొట్టారన్న(hitting a car ) ఆరోపణలపై ఆయన్ను అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. పోలీసులు కాంబ్లీకి (Vinod Kambli) వైద్య పరీక్షలు నిర్వహించి, బెయిల్‌పై విడుదల చేశారు. ఆదివారం మధ్యాహ్నం, కాంబ్లీని బాంద్రాలోని అతని ఇంటి నుంచి ముంబై పోలీసులు అరెస్టు చేశారు. కాంబ్లీ మద్యం మత్తులో బాంద్రాలోని తన రెసిడెన్షియల్ సొసైటీ గేటు వద్ద వాహనాన్ని ఢీకొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.

దీని తరువాత అతను అక్కడ ఉన్న సొసైటీ గార్డుతో తీవ్ర వాగ్వాదం చేశాడు. దాని కారణంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఆపై అతన్ని అరెస్టు చేశారు. అయితే వైద్య పరీక్షల తర్వాత బెయిల్ వచ్చింది.. అరెస్టు అనంతరం కాంబ్లీకి (Kambli) వైద్య పరీక్షలు నిర్వహించి బెయిల్‌పై పోలీసులు విడుదల చేశారని తెలుస్తోంది. ముంబై పోలీసులు మాట్లాడుతూ, “వినోద్ కాంబ్లీని అరెస్టు చేశాం. అనంతరం బెయిల్‌పై విడుదల చేశాం. అతని వైద్య పరీక్షలు భాభా హాస్పిటల్‌లో జరిగాయి’ అని తెలిపింది.

కొన్ని నెలల క్రితమే కాంబ్లీ (Kambli) వేరే కారణాలతో వార్తల్లో నిలిచాడు. డిసెంబర్ 2021లో, సైబర్ మోసం కేసు నమోదైంది. ఈమేరకు కాంబ్లీ బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఖాతా నుంచి లక్ష రూపాయలు డ్రా అయినట్లు పేర్కొంటూ ఫిర్యాదు చేశాడు. మొబైల్‌కు మెసేజ్ రావడంతో మోసం జరిగిన విషయం తెలిపిందంటూ పేర్కొన్నాడు.

BJP President JP Nadda Twitter Account Hacked: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన దుండగులు, ఉక్రెయిన్ కు సహాయం చేయాలంటూ ఫేక్ ట్వీట్స్, రంగంలోకి దిగిన నిపుణులు

వినోద్ కాంబ్లీ 1990లలో భారత జట్టులోకి ప్రవేశించాడు. చాలా కాలం పాటు జట్టులో భాగమయ్యాడు. అతను 17 టెస్టుల్లో 54 సగటుతో 1084 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు ఉన్నాయి. అదే సమయంలో 104 ODIలలో, 2477 పరుగులు అతని బ్యాట్ నుంచి వచ్చాయి. ఇందులో అతను 2 సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు సాధించాడు.