Former Maruti MD Jagdish Khattar booked for Rs 110 cr bank loan fraud: CBI (photo-PTI)

New Delhi, December 24: మరో బ్యాంకు స్కాము వెలుగులోకి వచ్చింది. ఈ స్కాం కేసులో మారుతీ సంస్థ మాజీ మేనేజింగ్ డైర‌క్ట‌ర్ జ‌గ‌దీశ్ ఖ‌ట్ట‌ర్‌పై( Former Maruti MD Jagdish Khattar) సీబీఐ పోలీసులు(CBI) కేసు న‌మోదు చేశారు. బ్యాంకు నుంచి అక్ర‌మంగా 110 కోట్ల రుణం తీసుకున్న అంశంలో జ‌గ‌దీశ్‌పై కేసు న‌మోదు అయ్యింది.

కార్నేష‌న్ ఆటో ఇండియా కంపెనీ (Carnation Auto India) పేరుతో ఆయ‌న ఈ రుణం తీసుకున్నారు. ఈ రుణం తీసుకోవడం ద్వారా పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకుకు(Punjab National Bank) సుమారు 110 కోట్ల న‌ష్టం వాటిల్లిన‌ట్లు సీబీఐ అధికారులు(Central Bureau of Investigation) పేర్కొన్నారు. సోమ‌వారం సాయంత్రం జ‌గ‌దీశ్ నివాసాల్లో సీబీఐ సోదాలు నిర్వ‌హించింది.

1993 నుంచి 2007 వ‌ర‌కు మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్ సంస్థ‌లో ఖ‌ట్ట‌ర్.. మేనేజింగ్ డైర‌క్ట‌ర్‌గా చేశారు. రిటైర్ అయిన త‌ర్వాత ఆయ‌న కార్నేష‌న్ సంస్థ‌ను ప్రారంభించారు. 2009లో ఆయ‌న‌కు పీఎన్‌బీ రూ. 170 కోట్ల రుణం మంజూరు చేసింది. 2015లో ఆ రుణాన్ని ఎన్‌పీఏగా ప్ర‌క‌టించారు. కాగా ఇప్పుడు పీసీబీ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు ఖ‌ట్ట‌ర్‌పై కేసు న‌మోదు చేశారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.