Kamal Sharma Passed Away: గుండెపోటుతో పంజాబ్‌ బీజేపీ మాజీ అధ్యక్షుడు కమల్‌ శర్మ కన్నుమూత, విషాదంలో పంజాబ్ బీజేపీ శ్రేణులు, మరణించడానికి రెండు గంటల ముందు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన శర్మ
Former Punjab BJP Chief Kamal Sharma Dies (Photo-ANI)

Chandigarh, October 27 : దీపావళి పండుగ వేళ పంజాబ్‌ బీజేపీలో విషాదం చోటు చేసుకుంది. పంజాబ్ బిజెపి మాజీ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నేత కమల్ శర్మ (48) కన్నుమూశారు. ఫెరొజెపూర్ జిల్లాలో గుండెపోటుతో ఆదివారం ఉదయం కమల్ శర్మ మరణించారు. ఎప్పటిలాగే మార్నింగ్ వాక్‌కు వెళ్లిన కమల్ శర్మకు ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది. అదే సమయంలో ఆయనతో పాటు ఉన్న సన్నిహితుడొకరు వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తీసుకొచ్చేలోపే శర్మ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కమల్ శర్మకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఆయన గుండెపోటుతో మరణించడానికి రెండు గంటల ముందు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ఆయన మృతిపట్ల బీజేపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కమల్ మృతి పార్టీకి తీరని లోటని రాష్ట్ర బీజేపీ శాఖ సంతాపాన్ని వ్యక్తం చేసింది.