representational image (photo-Getty)

Salem, Dec 8: అల్లారు ముద్దుగా పెంచుకున్న పెద్ద కుమారుడు క్యాన్సర్ బారీన పడి మరణించడంతో కుటుంబం మొత్తం విషాదంలోకి వెళ్లిపోయింది. ఆ విషాదం నుంచి తేరుకోలేక ఆత్మహత్యకు (Salem Family Commits Suicide) పాల్పడింది. ఈ విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. విషాద ఘటన (Family Commits Suicide) వివరాల్లోకెళితే.. తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో అమ్మాపేట సమీపంలోని వలకాడుకు చెందిన మురుగన్, కోకిల దంపతులకు కుమారులు మదన్‌ కుమార్‌ (14), వసంతకుమార్‌(12), కార్తీక్‌(9) ఉన్నారు.

సమీప గ్రామంలోని ఓ సెలూన్ షాపులో మురుగన్ పనిచేస్తున్నారు. ఈ మధ్య కొన్ని నెలల క్రితం పెద్ద కుమారుడైన మదన్ కుమార్ క్యాన్సర్ భారీన పడి మరణించారు. పెద్ద కుమారుడి మరణంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. స్థానికులతోసరిగ్గా మాట్లాడకుండా పెద్దకుమారుడిని తలచుకుంటూ అతడి ఫొటో వద్దే మురుగన్, కోకిల్‌ కూర్చుని ఉండేవారు. ఈ నేపథ్యంలో మురుగన్‌ పనికి వెళ్లడం మానేశాడు. ఆ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. ఇద్దరు కుమారులకు విషమిచ్చి దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు.

మహిళను చంపి ఆ డెడ్‌ బాడీతో కోరిక తీర్చుకున్న కామాంధుడు, నిందితుడిని అరెస్ట్ చేసిన కర్ణాటక పోలీసులు, సిసిటివి ఫుటేజీ ద్వారా కేసును చేధించిన పోలీసులు

సోమవారం ఉదయం ఆ ఇంటి తలుపులు ఎంతకు తెరచుకోలేదు. దీంతో పక్కింట్లో ఉన్న వాళ్లకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఇంటి తలుపులు తెరిచి చూడగా ఇంట్లో మురుగన్, కోకిల, వసంతకుమార్, కార్తీక్‌లు విగతజీవులుగా పడివున్నారు. మృతదేహాలను పరిశీలించగా అందరూ విషం సేవించినట్టు సేలం డిప్యూటి కమిషనర్ చంద్రశేఖరన్ తెలిపారు.

.