Gautam Adani (File Image)

Mumbai, SEP 16:  గౌతం అదానీ (Gautam Adani) ఇప్పుడు ప్ర‌పంచంలో నెంబ‌ర్ 2 సంప‌న్నుడిగా నిలిచాడు. ఫోర్బ్స్ ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించింది. అమెజాన్ బాస్ జెఫ్ బేజోస్‌ను (Jeff Bezos) అదానీ వెన‌క్కి నెట్టేశారు. లూయిస్ విట్టాన్ ఓన‌ర్ బెర్నార్డ్ అర్నాల్ట్‌ను కూడా అదానీ దాటేశారు. ప్ర‌స్తుతం గౌతం అదానీ (Gautam Adani) ఆస్తుల విలువ 154.7 బిలియ‌న్ల డాల‌ర్లు. ఇక టాప్ నెంబ‌ర్‌లో ఉన్న ఎల‌న్ మ‌స్క్ (Elon Musk) ఆస్తుల విలువ 273.5 బిలియ‌న్ల డాల‌ర్లు. గ‌త నెల‌లో మూడ‌వ స్థానంలో ఉన్న అదానీ.. లూయిస్ విట్టాన్ ఓన‌ర్‌ను దాటేసి ఇప్పుడు రెండ‌వ స్థానంలోకి చేరుకున్నారు. అర్నాల్ట్ ఇప్పుడు మూడ‌వ స్థానంలో ఉన్నారు. ఆయ‌న ఆస్తుల విలువ 153.5 బిలియ‌న్ల డాల‌ర్లు. నాలుగ‌వ స్థానంలో ఉన్న బేజోస్ ఆస్తుల విలువ 149.7 బిలియ‌న్ల డాల‌ర్లు.

Jignesh Mevani: గుజరాత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌కు జైలుశిక్ష, అసెంబ్లీ ఎన్నికల ముందు భారీ షాక్, 2016 కు సంబంధించిన కేసులో 18 మందితో పాటూ శిక్ష ఖరారు 

రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ 92 బిలియ‌న్ల డాల‌ర్ల‌తో 8వ స్థానంలో నిలిచారు. అదానీ గ్రూపు ఓన‌ర్ అయిన అదానీకి ఏడు ప‌బ్లిక్ లిస్టింగ్ కంపెనీలు ఉన్నాయి. ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్, మైనింగ్‌, ఎన‌ర్జీ, ఇత‌ర రంగాల్లో ఆయ‌న‌కు కంపెనీలు ఉన్నాయి.

Video: ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 

గ‌త అయిదేళ్ల‌లో అదానీ .. విమానాశ్ర‌యాలు, సిమెంటు, కాప‌ర్ రిఫైనింగ్‌, డేటా సెంట‌ర్లు, గ్రీన్ హైడ్రోజ‌న్‌, పెట్రోకెమిక‌ల్ రిఫైనింగ్, రోడ్డు, సోలార్ సెల్ మాన్యుఫ్యాక్చ‌రింగ్ రంగాల్లో పెట్టుబ‌డి పెట్టారు. టెలికాం స్పేస్ రంగంలోకి కూడా అదానీ ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. గ్రీన్ ఎన‌ర్జీ కోసం అదానీ గ్రూపు సుమారు 70 బిలియ‌న్ల డాల‌ర్లు ఖ‌ర్చు చేయ‌నున్న‌ది.