ghaziabad maid washes dishes with his urine at gyan khand 2 indirapuram cctv footage revealed (Photo-Getty)

Lucknow, Febuary 23: బిజీ షెడ్యూల్ లో అందరూ తమ సొంత పనులు చేసుకోవడం చాలా కష్టతరమవుతోంది. ఇందులో భాగంగా అందరూ పనిమనుషులతో పనులు చేయించుకుంటూ ఉంటారు. అయితే ఈ న్యూస్ చూస్తే వారంతా ఓ సారి ఆలోచించుకోవాల్సిందే. దెబ్బకు మత్తు దిగి వారి పనులు వారు చేసుకుంటారు. వివరాల్లోకెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఇళ్లలో పనిచేసే ఓ మహిళ (Ghaziabad maid) చేసిన పని ఆ ఫ్లాట్ యజమానులందరినీ విస్తుపోయేలా చేసింది.ఘజియాబాద్ (Ghaziabad) పట్టణంలోని ఇందిరాపురంలో (Indirapuram) గల జ్ఞాన్‌ఖండ్-2 ప్రాంతంలోని ఫ్లాట్లలో పనిచేసే ఒక మహిళ పాత్రలు తోమేందుకు (Dishes Washes) తన మూత్రాన్ని వినియోగించింది.

రెండేళ్ల నుంచి తను ఎవరింట్లో అయితే పని చేస్తుందో వారందరి పాత్రలను తన యూరిన్ ద్వారా కడిగింది. ఈ విషయం సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వెల్లడయ్యేసరికి ఫ్లాట్లలోని వారంతా అవాక్కయ్యారు.

ఆ సీసీటీవీ ఫుటేజ్‌లో ఉన్నదాని ప్రకారం ముందుగా ఆ మహిళ పాత్రలన్నింటినీ శుభ్రంగా తోమి తరువాత, ఒక పాత్రలో తన మూత్రాన్ని (Urin) తీసుకువచ్చి దానితో ఆ పాత్రలను మరోమారు తోముతోంది. ఈ వీడియోను చూసిన వెంటనే షాక్ తిన్న ఫ్లాట్లలోని వారంతా పోలీసులకు ఆ మహిళపై ఫిర్యాదు చేశారు. ఆ మహిళ గత రెండేళ్లుగా ఈ ఫ్లాట్లలో పనిచేస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సో మీరు కూడా కొంచెం జాగ్రత్తపడండి