Representational Image | (Photo Credits: IANS)

Ghaziabad, December 29: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన (Ghaziabad Shocker) చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగా ఓ వ్యక్తిని నడిరోడ్డు మీద కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టి (Man Lynched in Loni Area) చంపేశారు. ఆ దారిన పోయే బాటసారులు మనకెందుకులే అని చోద్యం చూస్తూ నిలబడ్డారే తప్ప ఇది తప్పని ఎవరూ చెప్పలేదు. చెబితే ఏం చేస్తారోననే భయం వారిని వెంటాడినట్లు తెలుస్తోంది. బాధితుడిని కాపాడే ప్రయత్నం చేయని బాటసారులు ఆ అమానుష చర్యను వీడియోలు తీస్తూ దూరంగా నిలబడ్డారు.

ఉత్తరప్రదేశ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘజియాబాద్‌లోని లోనీకి చెందిన సంజయ్‌, గోవింద్‌కు మధ్య కొన్ని రోజుల క్రితం గొడవ జరిగింది. పూలకొట్టు పెట్టే విషయంలో స్థల కేటాయింపు విషయంలో ఇరువర్గాల మధ్య ఈ ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో గోవింద్‌ సంజయ్‌పై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం సంజయ్‌ సోదరుడు అజయ్‌ లోనీ మార్గం గుండా వెళ్తుండగా, అతడిని అటకాయించాడు. తన స్నేహితుడు అమిత్‌తో కలిసి కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశాడు.

తల్లి మరణించిందనే బెంగతో 10 ఏళ్లు చీకట్లోకి వెళ్లిపోయారు, స్థానిక ఎన్జీఓ సంస్థ సహాయంతో ముగ్గురు బయటకు.. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో బాధాకర ఘటన

దీంతో అజయ్‌ రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనపై సంజయ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితులు గోవింద్‌, అమిత్‌లను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. కాగా పోలీసులు సత్వరమే స్పందించి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదని మృతుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.