Gujarat: తల్లి మరణించిందనే బెంగతో 10 ఏళ్లు చీకట్లోకి వెళ్లిపోయారు, స్థానిక ఎన్జీఓ సంస్థ సహాయంతో ముగ్గురు బయటకు.. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో బాధాకర ఘటన
Representational Image. (Photo Credits: Pixabay)

Ahmedabad, December 29: గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్ లో విషాద చాలా భాదాకర ఘటన చోటు చేసుకుంది. తల్లి మరణించిదనే బెంగతో దాదాపు కొడుకులు, కుమార్తె పది సంవత్సరాలు బయటి ప్రపవచానికి దూరమయ్యారు. ఘటన వివరాల్లోకెళితే...రాజ్ కోట్ లోని కిషన పుర గ్రామంలో తల్లి మరణించిందనే బెంగతో దాదాపు పదేళ్ళు రూములో లాక్ వేసుకుని (Three Siblings Locked Up in Room) అన్నా తమ్ముడు చెల్లి గడిపారు.

అన్నదమ్ములయిన అమ్రిష్, భవేష్ వారి చెల్లెలు మేఘనా, వారి తల్లి మరణించినప్పటి నుండి దాదాపు ఒక దశాబ్దం పాటు తమను తాము గదిలో బంధించుకుని ప్రపంచానికి దూరమయ్యారు. 30 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసున్న ముగ్గురు తోబుట్టువులను డిసెంబర్ 27న స్థానిక ఎన్జీఓ (NGO) సంస్థ రక్షించింది.

వారిని ఆ స్థితిలో చూడటానికే చాలా భయంకరంగా ఉంది. పాత ఆహారం మరియు చెల్లాచెదురుగా ఉన్న కాగితాలతో దుర్వాసనతో గది ఉంది అని, వారు అస్థిపంజరాలు ఉన్నట్లు గదిలో పడుకున్నారు అని వారిని కాపాడిన సాతి సేవా గ్రూప్ ఎన్జీవో సంస్థ తెలిపింది.అమ్రిష్ మరియు భావేష్ ఇద్దరికీ జుట్టు కత్తిరించలేదు. వారి గడ్డం దాదాపు నడుము వరకు పెరిగింది. ఇంటి నుండి బయటకు తీసుకువచ్చిన తరువాత, వాలంటీర్లు వారి గడ్డం మరియు జుట్టును కత్తిరించడానికి ఒక మంగలిని తీసుకువచ్చారు మరియు వారు స్నానం చేయించి కొత్త బట్టలు ఇచ్చారు. ఇన్ని సంవత్సరాలు వారు కేవలం టవల్స్ చుట్టుకొని మాత్రమే ఉన్నారు.

ఓ చోట పెగ్ పోయలేదని పొడిచి చంపేశాడు, మరోచోట చపాతీలు చల్లగా ఉన్నాయని కాల్చేశాడు, ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటనలు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న యూపీ పోలీసులు

వారి తండ్రి (Father) నవీన్ మెహతా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. వారికీ కేవలం ఆహారం మాత్రమే పార్సల్స్ తీసుకోని గది బయట పెట్టేవాడు.అతని చెప్పిన ప్రకారం, అతని పిల్లలు బాగా చదివారని తెలిసింది . 'నా పెద్ద కుమారుడు, అమ్రిష్, 42, బిఎ, ఎల్‌ఎల్‌బి డిగ్రీలతో ప్రాక్టీస్ చేసే న్యాయవాది, మేఘనా, 39, సైకాలజీలో ఎంఏ. నా చిన్న కుమారుడు ఎకనామిక్స్లో బిఎ మరియు మంచి క్రికెట్ ఆటగాడని చెబుతున్నారు.

నా భార్య అనారోగ్యంతో ఐదు-ఆరు సంవత్సరాలు నరకం చూసింది, ఆ తరువాత మరణించింది,

ఆ సంఘటన నా పిల్లలను తీవ్రంగా ప్రభావితం చేసింది, ఆ తరువాత వారు తమను తాము గదిలో బంధించుకున్నారు' అని అతను చెప్పాడు. బంధువులు, ఇరుగు పొరుగు వారు తమ పిల్లలపై క్షుద్ర పూజలు చేసారని అంటూ ఉంటారని అయన తెలిపాడు.

మరి ఆ తండ్రి 10 సంవత్సరాలుగా ఆహారం అందిస్తూ వస్తున్నానని చెబుతున్నారు.. తన పిల్లలకు కౌన్సిలింగ్ ఇప్పించలేకపోవడం చాలా బాధాకరం...