Image Used for Representational Purpose Only | (Photo Credits: ANI)

Lucknow, Dec 26: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఓ చోట పెగ్గు పోయలేదని ఓ చోట పొడిచి చంపేయగా..మరో చోట చపాతీలు చల్లగా ఉన్నాయని డాబా యజమానిని ఏకంగా తుఫాకీతో కాల్చి పడేశాడు ఓ కోపిష్టి.. దారుణ ఘటన వివరాల్లోకెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) శామ్లిలో జస్బిర్‌, క్రిష్ణపాల్‌ అనే ఇద్దరు స్నేహితులు మందు పార్టీ చేసుకున్నారు. మందు తాగుతున్న సమయంలో క్రిష్ణపాల్‌ గ్లాసులో మద్యం (liquor) అయిపోయింది.

జస్బిర్‌ను ఓ పెగ్‌ పోయమని అడగ్గా.. తన దగ్గర కూడా మద్యం తక్కువగా ఉందని చెప్పి అతను మందు పోయలేదు, ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన క్రిష్ణపాల్‌ పదునైన ఆయుధంతో జస్బిర్‌ను హత్య చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ శుక్రవారం నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఓ పెగ్‌ పోయనందుకే జస్బిర్‌ను హత్య చేసినట్లు క్రిష్ణపాల్‌ అంగీకరించాడు.

ఇక మరో దారుణ సంఘటనలోకి వస్తే.. ఉత్తరప్రదేశ్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు యూపీకి చెందిన అమిత్‌ చౌహాన్‌, కసుస్తాబ్‌ సింగ్‌ అనే ఇద్దరు యువకులు గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఓ డాబా దగ్గరకు వెళ్లి చపాతీలను (chapatis) ఆర్డర్‌ చేశారు. డాబాను మూయటానికి సిద్ధంగా ఉన్నడాబా యజమాని మిగిలి ఉన్న చపాతీలను వారికి పెట్టాడు. అయితే చపాతీలు చల్లగా ఉన్నాయంటూ వారు అతడితో గొడవపడ్డారు.

ఇద్దరు ఆత్మహత్య..తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న ఆన్‌లైన్ మనీ స్కాం, పోలీసులు దర్యాప్తులో తిమ్మతిరిగే విషయాలు, హెచ్చరికలు జారీ చేసిన ఆర్‌బీఐ

ముగ్గురి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన కసుస్తాబ్‌ సింగ్‌ జేబులోని తుపాకి తీసి డాబా యజమానిని కాల్చేశాడు. బుల్లెట్‌ కుడి తొడలోకి దూసుకుపోయింది. దీంతో అతడ్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు బుల్లెట్‌ను బయటకు తీశారు. అతడికి ప్రాణాపాయం ఏమీ లేదని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.