Gold Price: రికార్డులు బ‌ద్ద‌లు కొడుతున్న బంగారం ధ‌ర‌, 10 గ్రాముల గోల్డ్ ఏకంగా రూ. 66వేలు, మరింత పెరిగే అవ‌కాశ‌ముందంటున్న నిపుణులు
Gold | Representational Image | (Photo Credits: IANS)

Mumbai, March 06: బంగారం ధర రికార్డు గరిష్ఠాలకు (Gold Price) చేరింది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర దేశీయ మార్కెట్లో  రూ.66,000 దాటింది. మంగళవారం రాత్రి 11 గంటల సమయానికి బులియన్‌ మార్కెట్లో రూ.66,680 వద్ద ట్రేడ్‌ అయింది. అంటే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.61,080 వరకు అవుతుంది. సోమవారం 24 క్యారెట్ల బంగారం ధర   రూ.65,050గా ఉంది. ధర ఇంతలా పెరగడంతో అమ్మకాలు బాగా తగ్గినట్లు బులియన్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు వెల్లడించారు. వెండి కిలో ధర కూడా సోమవారం రూ.72,000 కాగా, మంగళవారం రూ.73,950కి చేరింది. అమెరికాలో వడ్డీరేట్లు తగ్గుతాయనే సూచనలు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు తొలగకపోవడం, కేంద్రీయ బ్యాంకుల నుంచి పసిడి నిల్వలు పెంచుకునేందుకు లభిస్తున్న ఆసక్తి, క్రిప్టోకరెన్సీల విలువ గణనీయంగా పెరగడంతో దానిని హెడ్జింగ్‌ చేసుకునేందుకు పసిడిపైనా పెట్టుబడులు పెడుతుండటం వల్లే ధరలు ఇంతగా పెరుగుతున్నాయని ఈ రంగ నిపుణులు చెబుతున్నారు.

iQOO Neo9 Pro 5G: ఐకూ నుంచి నియో9 ప్రో 5జీ మిడ్-రేంజ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ విడుదల.. నథింగ్2, వన్‌ప్లస్12R వంటి ఫోన్‌లకు ఇది పోటీ, దీని ఫీచర్లు చూస్తే షేక్ అవుతారు, ధరెంతో తెలిస్తే షాక్ అవుతారు! 

ధరలు భగ్గుమంటుండటం, దేశీయంగా వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు ఏప్రిల్‌ మధ్య నుంచి లేకపోవడం వల్ల.. బంగారం, వెండి అమ్మకాలు బాగా తక్కువగా జరుగుతున్నాయని వివరించారు. దేశీయంగా 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.67,000 వరకు చేరే అవకాశం ఉందని తెలిపారు.