ఐకూ నియో9 ప్రో 5జీ ఫోన్ | Pic: Iqoo official

iQOO Neo9 Pro 5G Smartphone: వివో యాజమాన్యంలోని ఐకూ టెక్నాలజీ కంపెనీ చాలా కాలంగా ఊరిస్తూ వస్తున్న తమ మిడ్-రేంజ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ iQOO Neo9 Pro 5G ను ఎట్టకేలకు భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ వేగవంతమైన పనితీరు, అద్భుతమైన కెమెరా, నాణ్యమైన బ్యాటరీ బ్యాకప్, ఆకట్టుకునే డిస్‌ప్లే, ఉత్సాహాన్ని కలిగించే గేమింగ్ అనుభవాన్ని అందిస్తుందని చెప్పబడింది. గేమింగ్, గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ టాస్క్‌ల కోసం Adreno 740 GPU కూడా ఉంది. ఆప్టిక్స్ పరంగా, OISకి మద్దతుతో 50MP సోనీ IMX 920 సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 16MP ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ కూడా ఉంది.

ఐకూ నియో9 ప్రో 5జీ ఫోన్ శక్తివంతమైన క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్‌తో ఆధారితమైనది. స్టోరేజ్ ఆధారంగా ఈ ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. అలాగే ఫైరీ రెడ్, కాంకరర్ బ్లాక్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ కాంబినేషన్లలో లభిస్తుంది. మార్కెట్లో ఈ ఫోన్ నథింగ్ ఫోన్ (2), Samsung Galaxy S24 Ultra, OnePlus 12R వంటి వాటికి ప్రత్యామ్నాయంగా ఉంటుంది.

మరి iQOO Neo9 Pro 5G స్మార్ట్‌ఫోన్‌లో ఇంకా ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి, ధర ఎంత తదితర విషయాలను ఈ కింద తెలుసుకోండి.

iQOO Neo9 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 120Hz - 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.78-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే
  • 8GB/12GB RAM, 128/256 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2  ప్రాసెసర్
  • వెనకవైపు 50MP+8MP  డ్యూయల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 16MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5160 mAh బ్యాటరీ సామర్థ్యం, 120W PD ఫాస్ట్ ఛార్జింగ్‌

ధరలు:

8GB RAM+128GB స్టోరేజ్‌ కాన్ఫిగరేషన్ కలిగిన వేరియంట్ ధర: రూ. 35,999/-

8GB RAM+256GB స్టోరేజ్ ఉన్న వేరియంట్ ధర: రూ. 37,999/-

12GB RAM + 256GB స్టోరేజ్ కలిగిన మోడల్ ధర: రూ. 39,999/-

ఈ కొత్త ఫోన్ టాప్ వేరియంట్లు ఫిబ్రవరి 23 నుండి అమెజాన్‌లో అందుబాటులో ఉంటాయి, అయితే 128GB స్టోరేజ్ వేరియంట్ మార్చి 21 నుండి అందుబాటులో ఉంటుంది.