Group 1 candidates approached Supreme Court(X)

New Delhi, Nov 7: ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియ నిబంధనలకు సంబంధించి సుప్రీంకోర్టు కీల‌క తీర్పునిచ్చింది. రిక్రూట్‌మెంట్‌ మధ్యలో రూల్స్ మార్చకూడదని అత్యున్న‌త న్యాయ‌స్థానం పేర్కొంది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం గురువారం ఉదయం కీలక తీర్పు వెల్ల‌డించింది. ఉద్యోగ నియామ‌క‌ ప్రక్రియ నిబంధనలు ఏకపక్షంగా ఉండకూడదని కోర్టు స్ప‌ష్టం చేసింది.

ఆర్టికల్ 39(బి) ప్రకారం అన్ని ప్రైవేట్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు, ప్రైవేటు ఆస్తులపై ప్రభుత్వ హక్కుల అంశంపై సుప్రీంకోర్ట్ కీలక తీర్పు

రాజ్యాంగంలో పేర్కొన్న‌ ఆర్టికల్ 14కు అనుగుణంగా ఉండాలని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియలో వివక్షకు తావులేకుండా ఉండాలని, పారదర్శకత త‌ప్ప‌నిస‌రి అని సూచించింది. ఇక రిక్రూట్‌మెంట్‌ మధ్యలో నిబంధనలను మారిస్తే అభ్యర్థులు గంద‌ర‌గోళానికి లోన‌వుతారని వివ‌రించింది. కాబట్టి ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభానికి ముందు ఒకసారి నిర్ణయించిన రూల్స్‌ను ఎట్టిప‌రిస్థితుల్లో మధ్యలో మార్చకూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది.