GST Revenue Collection - Representational Image. | (Photo Credits: PTI/File)

New Delhi January 02: జీఎస్టీ వసూళ్లు(GST collections) వరుసగా ఆరో నెలా రూ.లక్ష కోట్లను అధిగమించాయి. డిసెంబరులో(December) రూ.1.29 లక్షల కోట్లు వసూలయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 13 శాతం వృద్ధి నమోదైంది. గత నెలలో నమోదైన రూ.1.31 లక్షల కోట్లతో పోలిస్తే మాత్రం స్వల్పంగా తగ్గాయి.

డిసెంబరు నెలకుగానూ రూ.1,29,780 కోట్ల జీఎస్టీ(Gross Goods and Services Tax) వసూలైనట్లు కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది. ఇందులో కేంద్ర జీఎస్టీ (CGST) రూ.22,578 కోట్లు కాగా.. రాష్ట్రాల జీఎస్టీ (SGST) రూ.28,658 కోట్లు. సమ్మిళిత జీఎస్టీ (IGST) కింద రూ.69,155 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.37,527 కోట్లతో కలిపి), సెస్‌(CESS) రూపంలో రూ.9,389 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.614 కోట్లతో కలిపి) వసూలైనట్లు ఆర్థికశాఖ తెలిపింది.

గత ఏడాది నవంబరుతో పోలిస్తే ఈ సారి జీఎస్టీ(GST) వసూళ్లు 13శాతం, 2019లో ఇదే నెలతో పోలిస్తే 26 శాతం పెరిగాయి. 2021 ఏప్రిల్‌(APRIL) నెలలో వసూళ్లు జీవనకాల గరిష్ఠాన్ని తాకాయి. ఆ నెల రూ.1.41లక్షల కోట్లు వసూలయ్యాయి. ఇక అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో నెలకు సగటున రూ.1.30 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఇది తొలి త్రైమాసికంలో రూ.1.10 లక్షల కోట్లుగా, రెండో త్రైమాసికంలో రూ.1.15 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

GST Council Cuts Tax Rate on COVID: కరోనా వ్యాక్సిన్లపై జీఎస్టీ రేటులో ఎలాంటి మార్పు ఉండదని తెలిపిన కేంద్రం, ముగిసిన 44వ జీఎస్టీ మండలి సమావేశం, కీలక నిర్ణయాలు తీసుకున్న మండలి, కరోనా మందులు, వైద్య పరికరాలపై పన్నులు తగ్గింపు

ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణతో పాటు పన్ను ఎగవేత నిరోధక చర్యలు ఫలిస్తుండడం వల్లే వసూళ్లు పుంజుకుంటున్నాయని ఆర్థిక శాఖ తెలిపింది. రేట్ల హేతుబద్ధీకరణ కూడా అందుకు దోహదం చేస్తోందని పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలోనూ వసూళ్లు ఆశాజనకంగానే ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేసింది.