GST Council Cuts Tax Rate on COVID: కరోనా వ్యాక్సిన్లపై జీఎస్టీ రేటులో ఎలాంటి మార్పు ఉండదని తెలిపిన కేంద్రం, ముగిసిన 44వ జీఎస్టీ మండలి సమావేశం, కీలక నిర్ణయాలు తీసుకున్న మండలి, కరోనా మందులు, వైద్య పరికరాలపై పన్నులు తగ్గింపు
File Image of Nirmala Sitharaman | (Photo-ANI)

New Delhi, June 12: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) ఆధ్వర్యంలో 44వ జీఎస్టీ మండలి సమావేశం శ‌నివారం జ‌రిగింది. ఈ సమావేంశంలో కరోనా సంక్షోభం నేపథ్యంలో జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా మందులు, వైద్య పరికరాలపై పన్నుల తగ్గించారు. కోవిడ్‌-19 చికిత్సకు ఉపయోగించే మూడు రకాల మందులకు పన్ను మినహాయింపునిచ్చారు.

కొవిడ్‌ అత్యవసర వస్తువులు, బ్లాక్‌ ఫంగస్‌ మందులపై పన్ను రేట్ల తగ్గింపు, ఆక్సిజన్‌, ఆక్సీమీటర్లు, శానిటైజర్లు, వెంటిలేటర్లతో సహా పలు ఇతర వస్తువులపై జీఎస్టీ రాయితీ ఇచ్చే అంశాలను (GST Council Cuts Tax Rate on COVID) గుర్తించి చ‌ర్చించారు. వివిధ రాష్ట్రాల ఆర్థికమంత్రులు, ఇతర ముఖ్య అధికారులతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో శనివారం జరిగిన భేటీలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

కరోనా వ్యాక్సిన్లపై జీఎస్టీ రేటులో ఎలాంటి మార్పు ఉండదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 5 శాతం జీఎస్టీ యధా విధిగా అమలవుతుందని ఆమె స్పష్టం చేశారు. ఈమినహాయింపులు ఈ సంవత్సరం సెప్టెంబర్‌ 30 వరకు చెల్లుబాటులో ఉంటాయని నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

జూన్‌ 26న రాజ్‌భవన్ల ముట్టడికి పిలుపునిచ్చిన రైతు సంఘాలు, ఉద్యమానికి ఏడు నెలలు పూర్తవుతున్న సందర్భంగా గవర్నర్ల నివాసాల ఎదుట నల్లజెండాలతో నిరసన

దీంతో వ్యాక్లిన్లపై జీఎస్టీ వడ్డింపు నుంచి ఊరట లభిస్తుందని ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది. ఆంబులెన్స్‌లపై విధించే జీఎస్టీని 12 శాతానికి తగ్గించింది. ఇప్పటివరకు ఇది 28శాతంగా ఉంది.అలాగే ఎలక్ట్రిక్ ఫర్నేసులు,టెంపరేచర్‌ తనిఖీపరికరాలపై 5శాతం జీఎస్టీని వసూలు చేయనున్నారు. దీంతోపాటు బ్లాక్‌ఫంగస్‌ చికిత్సలో వాడే ఆంఫోటెరిసిన్‌-బీపై జీఎస్టీ మినహాయింపు నివ్వడం విశేషం.

స‌మావేశం ముగిసిన అనంత‌రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ మీడియాతో మాట్లాడారు. జీఎస్టీ మండ‌లి స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు ఆమె వెల్ల‌డించారు. క‌రోనా మెడిసిన్స్, ప‌రిక‌రాల‌పై ప‌న్నుల‌ను త‌గ్గిస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకున్న‌ది. బ్లాక్ ఫంగ‌స్ చికిత్స‌లో వాడే రెండు ఔష‌ధాలు ఆంఫోటెరిసిన్ బీ, టోసిలిజుమాబ్‌కు జీఎస్టీ మిన‌హాయింపు ఇచ్చారు. రెమ్‌డెసివిర్‌పై ప‌న్ను 12 నుంచి 5 శాతానికి (Medicines and Equipment From 12% to 5%) త‌గ్గించారు.

కరోనా సెకండ్ వేవ్‌తో ఏకంగా 719 మంది వైద్యులు మృతి, దేశంలో కొత్తగా 84,332 కరోనా కేసులు, 4002 మంది మృతితో 3,67,081కు పెరిగిన మరణాల సంఖ్య

వ్యాక్సినేష‌న్‌పై జీఎస్టీ 5 శాతం య‌థాత‌థంగా ఉంచారు. ఆక్సిజ‌న్ యూనిట్లు, ఉత్ప‌త్తి యంత్రాల‌పై జీఎస్టీ త‌గ్గించారు. కొవిడ్ మెడిసిన్స్, టెస్టింగ్ కిట్లు, ప‌ల్స్ ఆక్సీమీట‌ర్ల‌పై జీఎస్టీ త‌గ్గించారు. ఆక్సిజ‌న్, మాస్కు, కొవిడ్ టెస్టు కిట్లు, ప‌ల్స్ ఆక్సిమీట‌ర్లు, వెంటిలేట‌ర్ల‌పై జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి త‌గ్గించారు.

ఆగస్టు నెలాఖరు వరకూ వీటి అమలుకు గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ సిఫారసు చేసినప్పటికీ ఈ రేట్లు సెప్టెంబర్ వరకూ అమలులో ఉంటాయని నిర్మలా సీతారామన్ మీడియాకు తెలిపారు. ఈ గడువును మరింత పెంచే విషయంపై తగిన సలహాలు, రాష్ట్రాల సమాచారం తీసుకుని సెప్టెంబర్ తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

44వ జీఎస్టీ మండలి ముఖ్య నిర్ణయాలు

వ్యాక్సిన్లపై 5 శాతం జీఎస్టీ అమలు

కోవిడ్ రిలీఫ్ మెటీరియల్‌పై సిఫారసులకు ఆమోదం

టోసిలుజుమాబ్, యాంఫోటెరిసిన్ ఔషధాలపై పన్ను మినహాయింపు

రెమ్‌డెసివిర్‌పై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు

మెడికల్‌ ఆక్సిజన్‌పై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు

జనరేటర్లు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లపై జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గింపు

వెంటిలేటర్లపై జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గింపు

సెప్టెంబర్‌ 30 వరకు కొనసాగనున్న సవరించిన జీఎస్టీ మినహాయింపులు