Coronavirus Lockdown. Representative Image (Photo Credit: PTI)

Mumbai, Mar 8: మహారాష్ట్రలో కరోనావైరస్ సెకండ్ వేవ్ మొదలయింది. ముఖ్యంగా రాజధాని ముంబైలో కరోనా వైరస్‌ శర వేగంగా విస్తరిస్తోంది. గత వారం రోజుల నుంచి కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై గార్డియన్ మినిస్టర్‌ అస్లాం షేక్‌ (Guardian Minister Aslam Shaikh) కీలక వ్యాఖ్యలు చేశారు. పరిస్థితి అదుపులోకి రానిపక్షంలో ముంబైలో మళ్లీ లాక్‌డౌన్‌ (Mumbai Lockdown News) విధించేందుకు సిద్ధమని ఆయన తెలిపారు. మరో 8 రోజులు పరిస్థితులను సమీక్షించి వ్యాప్తి అదుపులో లేనిపక్షంలో పాక్షిక లాక్‌డౌన్‌ (partial lockdown soon) విధిస్తామని స్పష్టం చేశారు.

మహారాష్ట్ర ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్‌ విధించనున్నట్లు వార్తలు రావడంతో ముంబైలోని అన్ని ప్రాంతాల్లో కిరాణా దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరి నిత్యావసరాలను కొనుగోలు చేస్తున్నారు. బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో రెండు రోజుల క్రితం మహారాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణం నుంచి దాదాపు 2,746 శాంపిల్స్‌ పరీక్షలకు తీసుకెళ్లగా.. వాటిలో 36 పాజిటివ్‌గా తేలాయి. కాగా, ఒక్క ముంబై విమానాశ్రయంలోనే గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి 2021 ఫిబ్రవరి నెలాఖరు వరకు 1480 కొత్త కేసులు రికార్డయ్యాయి. ముంబై విమానాశ్రయంలో ఇప్పటివరకు 2.20 లక్షల మంది కరోనా పరీక్షలు జరిపారు.

తెలంగాణలో 18 మందికి యుకె కరోనా స్ట్రెయిన్, రాఫ్ట్రంలో తాజాగా 111 మందికి కరోనా, ఏపీలో 136 కొత్త కేసులు, దేశంలో తాజాగా 18,599 మందికి కరోనా పాజిటివ్, తమిళనాడు వెళ్లాలంటే ఈ పాస్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం

గత నెల ఆరో తేదీ నుంచి విమానాశ్రయం ప్రాంగణంలో ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షాకేంద్రం అందుబాటులోకి వచ్చింది. ముంబైతోపాటు పలు ప్రాంతాల్లో తిరిగి కరోనా వ్యాప్తి చెందడం పట్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే విచారం ఆందోళన చేశారు. గత సెప్టెంబర్‌లో కంటే ఎక్కువగా కొన్నిప్రాంతాల్లో కేసులు రావడం ఆందోళన కలిగిస్తున్నదని చెప్పారు.

హైదరాబాద్ పేరు మార్చి తీరుతాం, సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు, భాగ్యనగర్‌గా మారుస్తామని..దీనిని ఎవరూ అడ్డుకోలేరన్న బీజేపీ నేత

ప్రజలు అవసరం ఉంటేనే ఇండ్ల నుంచి బయటకు రావాలని, కరోనా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని విన్నవిస్తూనే కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రజలు విధిగా మాస్కులు ధరించడంతోపాటు నిర్ణీత దూరం పాటించాలని ఆయన విజ్ఞప్తిచేశారు. ఇలా ఉండగా, ముంబైలో పాక్షికంగా లాక్‌డౌన్‌ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయని గార్డియన్‌ మినిస్టర్‌ అస్లాం షేక్‌ పేర్కొనడం బట్టి.. వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్టపడని పక్షంలో లాక్‌డౌన్‌ విధించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తున్నది.