Gujarat Accident: ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి, ఎదురెదురుగా వస్తున్న ట్రక్కు, కారు ఢీ, గుజరాత్‌లో విషాద ఘటన, ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం విజయ్ రూపానీ
Road accident (image use for representational)

Anand, Jun 16: గుజరాత్‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఒక చిన్నారి ఉన్నట్లు వారు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆనంద్‌ జిల్లా ఇంద్రనాజ్‌ గ్రామానికి సమీపంలో ఎదురెదురుగా వస్తున్న ట్రక్కు, కారు ఢీకొన్నాయి.

ఆనంద్‌ జిల్లాలోని తారాపూర్‌, అహ్మదాబాద్‌ జిల్లాలోని వటమన్‌ మీదుగా వెళ్లే రాష్ట్ర రహదారిపై ఈ ప్రమాదం (Car Collides With Truck in Anand District) జరిగిందని తారాపూర్‌ పోలీసులు వెల్లడించారు. ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు సూరత్ నుంచి భావ్ నగర్ కు వెళుతుండగా ఇంద్రనాజ్ గ్రామ సమీపంలో కారును ట్రక్కు (Car Collides With Truck) ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు.

‘‘ఒక చిన్నారితో సహా 10 మంది ప్రయాణిస్తున్న కారును అతివేగంగా ట్రక్కు ఢీకొట్టింది. కారులో ఉన్న 10 మంది అక్కడికక్కడే మరణించారు’’ అని ఓ పోలీసు అధికారి తెలిపారు. నుజ్జునుజ్జైన కారు నుంచి మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మరణించిన వారి వివరాల కోసం ఆరా తీస్తున్నామని వారు వెల్లడించారు. కాగా ట్రక్కు అతి వేగమే ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. భారీ శబ్ధంతో కారును ట్రక్కు ఢీకొట్టడంతో ప్రయాణికులు ఎగిరి చెల్లాచెదురుగా పడిపోయారు.

ఆ వ్యాపారవేత్త నాపై అత్యాచారం చేసి చంపేయడానికి ప్రయత్నించాడు, కాపాడాలంటూ ప్రధానిని సోషల్ మీడియా ద్వారా అర్థించిన బంగ్లాదేశ్‌ హీరోయిన్‌ పోరి మోని, నిందితుడు నజీర్‌ యు మహ్మూద్‌తో సహా నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

ట్రక్కు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా? అనే కోణంలో పోలీసులు కేసు విచారిస్తున్నారు. ఈ భారీ ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఒక్కసారిగా రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో పోలీసులు ట్రక్కు, కారును రోడ్డు పక్కకు తీసి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. మృతదేహాలను తారాపూర్ రెఫరల్ ఆసుపత్రికి తరలించారు.గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఈ ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆనంద్ జిల్లా కలెక్టరుతో సీఎం మాట్లాడి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఆదేశించారు.