Gujarat Chemical Factory Fire: గుజరాత్‌లోని సూరత్‌లో గల ఓ రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు మృతి చెందారు. మరో 27 మంది గాయాలపాలయ్యారు. ఈథర్ రసాయనం తయారు చేయు పరిశ్రమలో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
బుధవారం తెల్లవారుజామున ఇండస్ట్రీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణ్లాలోనే అగ్ని కీలలు ఫ్లోర్ అంతా వ్యాపించాయి. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు అదృశ్యమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా ఏడుగురు కార్మికుల మృతదేహాలు లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు.
అగ్ని ప్రమాదానికి గల కారణాలు ప్రస్తుతానికి తెలియదు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో దాదాపు 1.3 మిలియన్ డాలర్ల ఆస్తి నష్టం సంభవించినట్లు పరిశ్రమ యజమాని అశ్విన్ దేశాయ్ తెలిపారు.