Fire (Representational image) Photo Credits: Flickr)

Ahmedabad, November 4: గుజరాత్‌లోని ఒక బట్టల గౌడౌన్‌లో ఘోర అగ్నిప్రమాదం (Gujarat Fire) సంభవించింది. అహ్మదాబాద్‌ నానుకాకా ఎస్టేట్‌లోని పిప్లాజ్ రోడ్‌లోని టెక్స్‌టైల్ గోడౌన్‌లో బుధవారం ఒక్కసారిగా భారీ మంటలు (Textile Godown Collapses) వ్యాపించాయి. ఈ కారణంగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి భవనం ​కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది సజీవ దహనం అయ్యారు. మరికొందరికి గాయాలు అయ్యాయి.

దీంతో ఆ ప్రాంతమంతా నల్లటి పొగ వ్యాపించడంతో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది సజీవ దహనం కావడం ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

మంటలు, పేలుడు కారణంగానే భవనం కూలిపోయిందని అగ్నిమాపక అధికారి జయేష్ ఖాడియా తెలిపారు.ఈ ఘటనలో తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది గాయపడ్డారన్నారు. గాయపడిన వారిని శిథిలాల నుండి బయటకు తీసి ఎల్జీ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.