కేంద్ర ఎన్నికల కమిషనర్లు (Election Commissioners)గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సుఖ్‌బీర్ సింగ్ సంధూ (Dr Sukhbir Singh Sandhu), జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) నేడు అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘానికి రాజీవ్ కుమార్ చీఫ్ కమిషనర్‌గా ఉన్నారు. కమిషనర్‌గా ఉన్న అనూప్ చంద్ర పాండే గత నెలలో పదవీ విరమణ చేయగా.. మరో కమిషనర్ అరుణ్ గోయెల్ ఇటీవలే అనూహ్యంగా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కమిటీ కొత్త కమిషనర్లుగా సుఖ్‌బీర్ సింగ్ సింధూ, జ్ఞానేశ్ కుమార్‌లను ఎంపిక చేసింది. ఈ మేరకు గురువారం కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా వీరు కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టారు. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను బహిర్గతం చేసిన ఈసీఐ, అఫిషియల్ వెబ్ లింక్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని వెల్లడి
Here's ECI Tweet
CEC emphasized the significance of their joining at the historic point when ECI is all set to conduct #General Election2024 in the world's largest democracy.
Team ECI is set for action-packed weeks ahead ! pic.twitter.com/dpwMygUu8I
— Spokesperson ECI (@SpokespersonECI) March 15, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)