యూపీలోని జ్ఞానవాపి మసీదు వ్యవహారంపై వారణాసి జిల్లా కోర్టులో విచారణ పూర్తి అయ్యింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రేపటికి (మంగళవారం) రిజర్వ్ చేసింది. హిందూ వర్గం దాఖలుచేసిన రెండు పిటిషన్లతోపాటు ముస్లిం కమిటీ వేసిన ఒక పిటిషన్‌ను జిల్లా జడ్జ్‌ అజయ్‌కృష్ణ విశ్వేష విచారించారు. విచారణ సందర్భంగా కోర్టు హాలులోకి 23 మందిని మాత్రమే అనుమతించారు. వీరిలో 19 మంది లాయర్లు కాగా, నలుగురు పిటిషనర్లు. జ్ఞాన్‌వాపి ప్రాంగణంలోని శృంగార గౌరి కాంప్లెక్స్‌లో నిత్యపూజలకు, వజుఖానాలో వెలుగుచూసిన శివలింగాన్ని ఆరాధించేందుకు అనుమతి ఇవ్వడంతోపాటు శివలింగం లోతు ఎత్తు తెలుసుకునేందుకు సర్వే కొనసాగించాలని హిందూవర్గం కోరుతోంది. వజుఖానా మూసేయవద్దని ముస్లిం కమిటీ డిమాండ్ చేస్తోంది. అలాగే 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కింద జ్ఞానవాపి సర్వేను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతోంది.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)