జ్ఞాన్‌వాపి కాంప్లెక్స్‌లోని దక్షిణ సెల్లార్‌లో హిందువులు పూజలు చేసుకోవడానికి అనుమతించాలన్న వారణాసి కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ముస్లిం పక్షం చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు సోమవారం, ఫిబ్రవరి 26న తిరస్కరించింది. "వ్యాస్ తెహ్ఖానా"లో పూజను కొనసాగించడానికి హిందువులకు కోర్టు అనుమతించింది. జ్ఞాన్వాపి కాంప్లెక్స్ యొక్క మతపరమైన స్వభావానికి సంబంధించి వివాదాస్పద వాదనలకు సంబంధించి కొనసాగుతున్న సివిల్ కోర్టు కేసు మధ్య న్యాయస్థానం యొక్క ఆదేశం ఆమోదించబడింది.
వ్యాస్ కా టెఖనా వద్ద హిందువులు పూజలు నిర్వహించుకోవచ్చని ఇటీవల వారణాసి సెషన్స్ జడ్జి అనుమతిచ్చారు. దానిని అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో ( Allahabad High Court) సవాల్ చేసింది. పిటిషన్‌పై ఇరు వర్గాల మధ్య వాదనలు జరిగాయి. అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ రోహిత్ రంజన్ ఈ రోజు పూజలు చేసుకోవచ్చని తీర్పు ఇచ్చారు.జ్ఞానవాపి వివాదం నేపథ్యంలో 1993 నుంచి హిందువుల పూజలు నిలిచిపోయాయి. శివలింగ మినహా జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేకు అనుమతి, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారణాసి కోర్టు ఆదేశాలు
ఇటీవల వారణాసి కోర్టు తీర్పు ఇవ్వడంతో పూజలు ప్రారంభించారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని కోర్టు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేసింది. పూజ క్రతువుల కోసం ఆర్చకుడిని నియమించాలని కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్ట్‌కు వారణాసి జిల్లా కోర్టు స్పష్టం చేసింది.
Here's ANI News
Allahabad High Court dismisses plea challenging order permitting Hindu parties to offer puja in the 'vyas tehkhana' of Gyanvapi complex. pic.twitter.com/DbkADHQAIC
— ANI (@ANI) February 26, 2024
#WATCH | Gyanvapi matter | Advocate Prabhash Pandey says, "The judge dismissed the pleas that the Muslim side had filed against the District Judge's order...It means that the puja will continue as it is. District Magistrate will continue as the Receiver of the 'tehkhana'...This… https://t.co/TjTZhSrhCi pic.twitter.com/Qa6OFI2731
— ANI (@ANI) February 26, 2024
జ్ఞానవాపి మసీదు ప్రాంగణం దక్షిణ భాగంలో వ్యాస్ కా టెఖనా ఉంది. ఆ నేలమాలిగ వద్ద మహా శివుడు కొలువై ఉన్నారు. భక్తులు పూజలు చేయడం ప్రారంభించారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు