A barber shop in India | Representative Image. (Photo Credit: PTI/File)

New Delhi, April 25: కరోనావైరస్ మహమ్మారి కట్టడి నేపథ్యంలో ప్రస్తుతం అమలులో ఉన్న రెండో దశ లాక్డౌన్ కాలం మే 3 వరకు హెయిర్ కటింగ్ సెలూన్లు, బ్యూటీ పార్లర్లు తదితరమైనవి తెరిచేందుకు ఎలాంటి అనుమతి లేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వాటికి సంబంధించిన ఉత్పత్తులు విక్రయించడానికి మాత్రమే అనుమతులు మంజూరు చేసినట్లు స్పష్టం చేసింది.

లాక్డౌన్ యొక్క నిబంధనలను సడలిస్తూ ఈరోజు (శనివారం) నుంచి అన్ని రకాల రకాల వస్తు, సేవలకు సంబంధించి దుకాణాలు తెరుచుకోవచ్చునని కేంద్రం గత రాత్రే ఉత్తర్వులు వెలువరించిన విషయం తెలిసిందే.  కేంద్రం ఇచ్చిన ఉత్తర్వుల కాపీని ఈ లింక్ క్లిచ్ చేసి చూడవచ్చు

అయితే అందులో షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ పరిధిలోకి వచ్చే వాటికి అనుమతి ఉందని చెప్పటంతో కొన్ని రకాల షాప్స్ తెరవడం పట్ల సందిగ్థత నెలకొంది. అలాగే పలు రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రం హోం శాఖ అధికార ప్రతినిధులు శనివారం ప్రెస్ మీట్ పెట్టి దీనిపై స్పష్టతనిచ్చారు.

దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలోనైనా రెస్టారెంట్లు, మద్యం షాపులు తెరవడానికి ఎటువంటి అనుమతి ఇవ్వలేదని మరియు సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై కూడా నిషేధం కొనసాగుతుందని తెలిపారు.

సడలించిన మార్గదర్శకాలను స్పష్టంగా పేర్కొంటూ, కేంద్ర హోం శాఖ వ్యవహారాల సంయుక్త కార్యదర్శి పుణ్యా సలీలా శ్రీవాస్తవ మాట్లాడుతూ, " సెలూన్లు,  బార్బర్ షాపులు తదితరమైనవి సర్వీస్ అందిస్తాయి. అలా కాకుండా వస్తువుల అమ్మకాలు నిర్వహించే దుకాణాలకు మాత్రమే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.  ఎలాంటి రెస్టారెంట్లు మరియు మద్యం దుకాణాలు తెరించేందుకు కూడా అనుమతించినట్లు ఉత్తర్వుల్లో లేదు" అని ఆమె పేర్కొన్నారు.

Here's the ANI update:

ఇంతకుముందే చెప్పినట్లుగా లాక్డౌన్ కాలంలో మద్యం, పొగాకు, సిగరెట్లు తదితర వస్తువులను అమ్మడంపై నిషేధం కొనసాగుతుందని MHA పేర్కొంది. అలాగే, ఇ-కామర్స్ కంపెనీలకు కూడా నిత్యావసరాల వస్తువుల అమ్మకాలకు మాత్రమే అనుమతించబడుతుందని తెలిపింది. ఇక రెడ్ జోన్లు, కంటైన్మెంట్ జోన్లలో ఈ సడలింపులు ఏమి వర్తించవని, యధావిధిగా కఠినమైన లాక్డౌన్ అమలు చేయబడుతుందని కేంద్రం స్పష్టం చేసింది.