Harda, Feb 7: మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలోని బాణసంచా కర్మాగారంలో మంగళవారం జరిగిన పేలుడు (Harda Factory Blast) కారణంగా సంభవించిన అగ్నిప్రమాదంలో కనీసం 11 మంది మరణించగా, దాదాపు 200 మంది గాయపడ్డారు, వారిలో చాలా మంది ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ విషాద సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత సాయంత్రం ఫ్యాక్టరీ యజమానులిద్దరినీ పోలీసులు అరెస్ట్ (factory owners arrested) చేశారు.
కర్మాగారంలో చెలరేగిన మంటలు (Harda Firecracker Factory Explosion) చుట్టుపక్కల ఉన్న అనేక ఇళ్లను త్వరగా చుట్టుముట్టాయి. గంటల తరబడి శ్రమించి ఎస్‌డిఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా మంటలను ఆర్పివేశారు. శిథిలాల మధ్య రెస్క్యూ టీమ్‌లు ఇంకా మృతదేహాల కోసం వెతుకుతున్నారు. అనేక మంది తీవ్ర గాయాలతో వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. తీవ్ర గాయాలైన వారిని పోలీసులు ఏర్పాటు చేసిన గ్రీన్ కారిడార్ ద్వారా భోపాల్ ఎయిమ్స్‌కు తరలించారు.
టపాసుల తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు, ఆరు మంది మంటల్లో సజీవదహనం, మరో 59 మందికి తీవ్ర గాయాలు
ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పరిస్థితిని పరిశీలించి, ఎయిమ్స్‌లో చేరిన వ్యక్తులతో సమావేశమైన తర్వాత సాయంత్రం 5 గంటల వరకు 10 మృతదేహాలను వెలికితీసినట్లు చెప్పారు. అయితే అర్థరాత్రి దాటిన వారి సంఖ్య 11కి చేరింది. ఫ్యాక్టరీ యజమానులు రాజేష్ అగర్వాల్, సోమేష్ అగర్వాల్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
2022 సెప్టెంబర్‌లో గ్రామస్తుల నిరసనతో హర్దా జిల్లా యంత్రాంగం ఆ బాణసంచా కర్మాగారానికి సీలు వేసింది. అయితే, ఆ తర్వాత అగర్వాల్ సోదరులు (యజమానులు) జిల్లా కమీషనర్ కార్యాలయం నుండి సీలింగ్ ఆర్డర్‌పై స్టే తెచ్చుకున్నారు. ఈ కర్మాగారం హర్దా జిల్లాలోని రాష్ట్ర రాజధాని భోపాల్ నుండి 150 కి.మీ.లోని బైరాగర్ గ్రామంలో రెండు ఎకరాల భూమిలో విస్తరించి ఉంది.ఫ్యాక్టరీలో కనీసం 300 మంది పని చేసేవారు. సమాచారం ప్రకారం, ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వారిలో దాదాపు 40 కుటుంబాలు దాని క్యాంపస్‌లో నివసిస్తున్నాయి.
ముఖ్యమంత్రి యాదవ్ మంగళవారం సాయంత్రం హోం సెక్రటరీతో సహా ముగ్గురు సీనియర్ బ్యూరోక్రాట్‌లను, క్యాబినెట్ మంత్రిని సంఘటనా స్థలానికి పంపారు. అనంతరం దీనిపై విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. భోపాల్‌లోని ఓ ఆసుపత్రిలో తీవ్ర గాయాలపాలైన వారితో సమావేశమైన అనంతరం ముఖ్యమంత్రి బుధవారం సంఘటనా స్థలాన్ని సందర్శిస్తానని చెప్పారు.
సంఘటన నివేదించబడినప్పటి నుండి, యాదవ్ అధికారులతో వరుస సమావేశాలకు అధ్యక్షత వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న అన్ని క్రాకర్ ఫ్యాక్టరీల నుండి నివేదికలను కోరడంతో సహా పరిపాలనకు అనేక సూచనలు ఇచ్చారు. అన్ని జిల్లాల కలెక్టర్లు తమ నివేదికలను వచ్చే 24 గంటల్లోగా సమర్పించాలని కోరారు. ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ విచారం వ్యక్తం చేస్తూ మోహన్ యాదవ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ, ప్రతిపక్ష నాయకుడు (లోపి) ఉమాగ్ సిఘర్ హమీడియా ఆసుపత్రిలో చేరిన ప్రజలను కలిశారు. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సెషన్‌లో ప్రతిపక్షం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలతో అధికార బీజేపీని ఇరుకున పెట్టే అవకాశం ఉంది.