Chandigarh, June 29: హర్యానా రాష్ట్రంలో కరోనావైరస్ చాపకింద నీరులా విస్తరించుకుంటూ పోతోంది. అక్కడ తాజాగా హర్యానా బీజేపీ ఎమ్మెల్యేకు (BJP MLA Subhash Sudha) కూడా కరోనా సోకింది. కురుక్షేత్ర జిల్లాలోని థానేసర్ నియోజవర్గ శాసన సభ్యుడు (Thanesar in Kurukshetra) సుభాష్ సుధా గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. గురుగ్రావ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయనకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆయన వ్యక్తిగత సహాయకుడు అరుణ్ గులాటి మీడియాకు వెల్లడించారు. మహారాష్ట్రలో 1,030మంది పోలీసులకు కరోనా, కోవిడ్-19 కల్లోలానికి అక్కడ 59మంది పోలీసులు మృతి, ముంబైలో అత్యధిక కేసులు నమోదు
దీంతో సుభాష్ సుధా కుటుంబసభ్యులను కూడా క్వారంటైన్‌కు తరలించారు. కాగా జూన్ 21న సూర్యగ్రహణం నాడు బ్రహ్మ సరోవర్ ఒడ్డున నిర్వహించిన మతపరమైన కార్యక్రమంలో ఎమ్మెల్యే సుభాష్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో సాధువులు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులతో సహా దాదాపు 200 మంది సమావేశమయ్యారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీంతో వీరందరినీ ట్రేస్ చేసే పనిలో యంత్రాంగం సంసిద్దమైంది. వీరెవరిని కలిశారో అన్న దానిపై కూడా వివరాలు సేకరిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. 24 గంటల్లో 19 వేల కేసులు నమోదు, దేశంలో 5.5 లక్షలకు చేరువలో కరోనా కేసులు, ఒకే రోజు 380 మంది కరోనాతో మరణం
కురుక్షేత్ర జిల్లాలోనే ఇప్పటివరకు 115 కరోనా కేసులు నమోదవగా రాష్ర్ట వ్యాప్తంగా 13,829 కేసులు నమోదయినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లోనే 402 కొత్త కోవిడ్ కేసులు వెలుగు చూశాయని హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. హర్యానా రాష్ర్ట వ్యాప్తంగా రికవరీ రేటు 64.48% ఉండగా ప్రస్తుతం 4,689 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది.