Rape (Photo-IANS)

పాల్వాల్, సెప్టెంబర్ 7: హర్యానాలోని పల్వాల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన మహిళపై కొందరు పోలీసులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.ఆ తర్వాత మరో వ్యక్తికి ఆమెను అమ్మేశారు. అక్కడ కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. పాల్వాల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 23న వివాహిత తన భర్తపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది.అక్కడ ఎస్‌ఐ శివ చరణ్‌ను ఆమె కలిసింది.కాగా, ఆ మహిళ నుంచి ఫిర్యాదు తీసుకునేందుకు ఎస్‌ఐ శివ చరణ్‌ నిరాకరించాడు.

సహచర పోలీస్‌తో కలిసి సమీపంలోని పొలం వద్దకు వెళ్లాలని ఆమెను బలవంతం చేశాడు. అక్కడ వేచి ఉన్న నిరంజన్, భీమా, ఆ పోలీస్‌ కలిసి ఆ మహిళపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.మూడు రోజుల పాటు ఇంట్లో బందీగా ఉంచిన తర్వాత నిందితులు మహిళపై పదేపదే అత్యాచారం చేశారని పోలీసులు వార్తా సంస్థ పిటిఐకి తెలిపారు. అనంతరం ఆ మహిళను పల్వాల్‌లోని శాంతి అనే మరో మహిళ ఇంటికి తీసుకెళ్లారు. ఆ రాత్రి కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

కేరళలో దారుణం, మద్యం మత్తులో ముగ్గురు కూతుళ్ల గొంతు కోసిన తండ్రి, అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య

ఈ దారుణ ఘటనలో పోలీసులు ఆదివారం ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో హసన్‌పూర్ పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ పేరు కూడా నిందితుల్లో ఒకరిగా ఉంది.నిందితులలో ఒకరి ఫోన్‌ను పట్టుకోవడంతో మహిళ సంఘటనను నివేదించగలిగింది.ఆ ఫోన్ నుంచి పోలీసులకు ఫోన్ చేయడంతో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అనంతరం ఆమెను రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.ఎస్‌ఐ శివ చరణ్‌తో సహా ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేశారు.ఈ ఘటనపై హర్యానా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.