Haryana Coronavirus: జర్నలిస్టుకు రూ.10 లక్షల బీమా, కీలక నిర్ణయం తీసుకున్న హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, హర్యానాలో 264కి చేరిన కరోనావైరస్ కేసుల సంఖ్య
Haryana to Provide Insurance of Rs 10 Lakh Each to All Journalists Reporting During COVID-19 Pandemic (Photo-PTI)

Chandigarh, April 23: దేశంలో కరోనా వైరస్‌పై యుద్ధం చేస్తున్న వారిలో జర్నలిస్టులు కూడా ఉన్నారు. కోవిడ్ 19 మీద ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. దానికి సంబంధించిన వార్తలను ప్రజలకు చేరవేస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడు, మహారాష్ట్రలో పలువురు జర్నలిస్టులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడుతున్నాయి. దేశ రాజధానిలో కరోనా కల్లోలం, 45 రోజులు పసిపాప మృతి, 2248కి కరోనా చేరిన కోవిడ్ 19 కేసుల సంఖ్య, 71 కంటైన్‌మెంట్ జోన్ల‌ను ఏర్పాటు చేసిన ఢిల్లీ సర్కారు

ఇందులో భాగంగా హర్యానా ప్రభుత్వం జర్నలిస్టులకు ప్రమాద బీమా కల్పించింది. ప్రతి జర్నలిస్టుకు రూ. 10 లక్షల చొప్పున బీమా కల్పిస్తున్నట్లు హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ వెల్లడించారు. సీఎం మనోహర్‌ లాల్‌ నిర్ణయం పట్ల హర్యానా జర్నలిస్టులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Here's ANI Tweet

హర్యానాలో తాజాగా 9 కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ కేసుల సంఖ్య 264కి చేరింది. 11 మంది పేషంట్లు రికవరీ అయ్యారు. 103 మంది చికిత్స తీసుకుంటున్నారు. ముగ్గురు ఈ వ్యాధి కారణంగా మరణించారు.