Hathras, September 30: యూపీలో సామూహిక అత్యాచారానికి గురై ఢిల్లీ ఆస్పత్రిలో కన్నుమూసిన యువతి మృతదేహాన్ని స్వస్థలానికి తరలించే క్రమంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. హత్రాస్ అత్యాచార (Hathras Gangrape) బాధితురాలి అంత్యక్రియలను నిన్న అర్ధరాత్రి 2:30 గంటలకు పోలీసులు నిర్వహించారు. ఆమె అంత్యక్రియలకు కుటుంబ సభ్యులను పోలీసులు అనుమతించలేదు. మృతురాలి కుటుంబసభ్యులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ మృతదేహాన్ని పోలీసులే (Hathras Police) బుధవారం తెల్లవారుజామున 3గంటలకు బలవంతంగా దహనం చేశారు. ఈ ఉదంతంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తొలుత ఫిర్యాదు తీసుకోవడంలోనూ, ఇప్పుడు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించే సమయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. తమ సంప్రదాయానికి విరుద్ధంగా అర్ధరాత్రి శవ దహనం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దుస్థితి ఎవరికీ రాకూడదంటూ బాధితురాలి తల్లి విలపించిన తీరు ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తోంది. నిందితులకు ఉరి శిక్ష విధించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూ.. పోలీసుల వాహనానికి, అంబులెన్స్‌కు అడ్డుపడ్డారు.\
తామే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తామని పోలీసులను కోరామని మృతురాలి సోదరుడు పేర్కొన్నారు. కానీ పోలీసులు కుటుంబ సభ్యుల మాట వినకుండా రాత్రికి రాత్రే కుటుంబ సభ్యులను రానివ్వకుండా అంత్యక్రియలు నిర్వహించారు.మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువుల నివాసాలకు తాళం వేయడంతో.. వారు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. అక్కడ పోలీసులను భారీగా మోహరించారు.
Here's what the victim's brother said:
We'd told Police that we'll perform funeral in morning. But they were in haste & were forcing us to do it immediately. They said it has been 24 hrs and body is decomposing. We wanted to do it in morning as more relatives would've come by then: Brother of #Hathras gangrape victim pic.twitter.com/zu5llvsj8N
— ANI UP (@ANINewsUP) September 30, 2020
ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నందున, రాత్రి రాత్రే అంత్యక్రియలు చేయాలని పోలీసులు బాధితురాలి కుటుంబ సభ్యులకు సూచించారు. అయితే ఇది తమ సంప్రదాయానికి విరుద్ధమని, శవాన్ని ఇంటికి తీసుకువెళ్లి, రేపు ఉదయమే దహనం చేస్తామని ఆమె తండ్రి పోలీసులకు చెప్పారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాదోపదవాదాలు (Cops Didn't Allow Them to Bring Body Home) జరగాయి. పోలీసుల తీరును నిరసిస్తూ గ్రామస్తులు, బాధితురాలి బంధువులు వారి వాహనాలకు అడ్డుగా నిలిచి నిరసన తెలిపారు. అయినప్పటికీ అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో పోలీసులు ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Here's the latest tweet from Hathras police:
थाना चन्दपा क्षेत्रान्तर्गत घटित दुर्भाग्यपूर्ण घटना में पुलिस एवं प्रशासन की देखरेख में परिजनो द्वारा मृतिका के शव का अन्तिम संस्कार किया गया है, उक्त सम्बन्ध में ज्वाइन्ट मजिस्ट्रेट द्वारा दी गई बाईट I@AwasthiAwanishK @dgpup @Uppolice @CMOfficeUP @HomeDepttUP @adgzoneagra pic.twitter.com/HiDIYj7dVe
— HATHRAS POLICE (@hathraspolice) September 30, 2020
సెప్టెంబర్ 14వ తేదీన 20 ఏళ్ల యువతిని పంట పొలాల్లోకి తీసుకెళ్లి.. నాలుక కోసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను తొలుత అలీఘర్‌లో చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో, ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం ప్రాణాలు కోల్పోయింది. పక్షవాతం, శరీరంలోని ప్రధాన భాగాలన్నీ తీవ్రంగా దెబ్బతినడంతో రెండు వారాలుగా చిత్రవధ అనుభవించిన బాధితురాలు కన్నుమూసింది. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయా పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేశారు.
తొలుత ఈ కేసులో హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, బాధితురాలి వాంగ్మూలం తర్వాత అత్యాచార కేసు నమోదు చేశారు. ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనను నిరసిస్తూ.. న్యూఢిల్లీలోని విజయ్ చౌక్‌లో కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించింది. ఉత్తరప్రదేశ్‌లోని జంగిల్‌రాజ్‌కు మరో యువతి బలైందని పార్టీ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు.