Mumbai, December 3: దేశంలోని అతి పెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు చెందిన కస్టమర్లు (HDFC Bank Ltd customers) సమస్యలు ఎదుర్కొంటున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్(HDFC Net Banking), మొబైల్ యాప్ (HDFC Mobile App)ల్లో 24 గంటలుగా వినియోగదారులకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. నిన్న ఉదయం 10 గంటలకు సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.
దీంతో కస్టమర్లు నెట్‌బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సర్వీసులలోకి లాగిన్ అయ్యేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం పనిదినం నెల ఆరంభం కావడం, ఆఫర్ల సమయం కావడంతో.. ఆ బ్యాంకు సర్వర్లు మొరాయించాయి. మంగళవారం ఉదయం వరకు కస్టమర్లు ఇబ్బందులు పడ్డారు.
ఆయా అకౌంట్లలోకి లాగిన్ అవుదామని యత్నిస్తుంటే సర్వీస్ అందుబాటులో లేదని మెసేజ్‌లు వస్తున్నాయంటూ హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) కస్టమర్లు పెద్ద ఎత్తున ఆ బ్యాంకుకు ట్విట్టర్(Twitter)లో ఫిర్యాదులు చేశారు. అయితే మంగళవారం ఉదయం వరకు పరిస్థితి కొంత మెరుగైనట్లు తెలిసింది.
కస్టమర్ల ఫిర్యాదు
This is the page am looking. What happened? pic.twitter.com/8r2RPNvndl
— Lova Raju Balam (@rajlova79) December 2, 2019
సోమవారం ముఖ్యమైన లావాదేవీలు చేసుకోలేకపోయామని పలువురు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్లు ఫిర్యాదు చేయగా, సమస్యను పరిష్కరించేందుకు యత్నిస్తున్నామని, సర్వర్లకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ వచ్చినందునే ఈ సమస్య వచ్చిందని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది.
HDFC Bank Tweet
Good morning tweeple! Let's focus on the good.
— HDFC Bank Cares (@HDFCBank_Cares) December 2, 2019
త్వరలోనే తాము సర్వీసును అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. ఖాతాదారులకు కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నట్లు బ్యాంక్ ట్విట్టర్‌లో పేర్కొంది.కాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు సంబంధించి కస్టమర్లు జరిపే లావాదేవీల్లో 92 శాతం వరకు లావాదేవీలు ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్‌లకు సంబంధించినవే ఉంటుండడం విశేషం..! కాగా ఈ బ్యాంకుకు ఏషియా మనీస్ బెస్ట్ బ్యాంకు అవార్డు 2019లో వచ్చింది. మొత్తం 4.5 కోట్ల మంది వినియోగదారులు ఈ బ్యాంకుకు ఉన్నారు. వీరిలో సగం మంది నెట్ బ్యాంకింగ్ ద్వారానే కార్యాకలాపాలు నిర్వహిస్తున్నారు.