Represerntational Image (Photo credits: stevepb/Pixabay)

Gandhi Nagar, Dec 20: గుజరాత్‌ తీరంలో సోమవారం భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. రూ. 400 కోట్ల విలువైన 77 కిలోల హెరాయిన్‌తో (Heroin Worth Rs 400 Cr Seized) వెళ్తున్న పాకిస్తాన్‌కు ఫిషింగ్ బోటును గుజరాత్ ఏటీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ డిఫెన్స్ పిఆర్‌ఓ ప్రకారం.. ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ ఎటీఎస్‌తో సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో.. భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్‌ పడవలో (Pak Boat off Gujarat Coast) హెరాయిన్‌ను తరలిస్తున్నారని గుర్తించి అధికారులు వాటిని సీజ్‌ చేశారు. డ్రగ్స్‌ను తరలిస్తున్న ఆరుగురిని (6 Crew Members Held) అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కోసం పడవను గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని జాఖౌ తీరానికి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.

ఆదివారం రాత్రి ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఎటిఎస్) సంయుక్త ఆపరేషన్‌లో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. కోస్ట్ గార్డ్, రాష్ట్ర ATS సంయుక్త ఆపరేషన్‌లో ఆరుగురు సిబ్బందితో కూడిన పాకిస్తాన్ ఫిషింగ్ బోట్ 'అల్ హుసేనీ'ని భారత జలాల్లో పట్టుకున్నట్లు గుజరాత్ రక్షణ PRO ట్వీట్‌లో తెలిపారు. సుమారు రూ.400 కోట్ల విలువైన 77 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.

బాలిక కిడ్నాప్.. తొమ్మిది రోజుల పాటు దారుణంగా అత్యాచారం, ఈ కేసులో 13 మందికి 20 ఏళ్ల జైలు శిక్ష, మరో ఇద్దరికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన రాజస్థాన్ కోర్టు, ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా

ఈ ఏడాది ఏప్రిల్‌లో కోస్ట్‌గార్డ్‌, ఏటీఎస్‌లు కచ్‌లోని జఖౌ తీరం సమీపంలోని భారత జలాల నుంచి ఎనిమిది మంది పాకిస్థానీ పౌరులతో సుమారు రూ. 150 కోట్ల విలువైన 30 కిలోల హెరాయిన్‌తో తరలిస్తున్న పడవలో ఇదే విధమైన ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నారు. గత నెలలో గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి నుంచి దాదాపు రూ.600 కోట్ల విలువైన హెరాయిన్ డ్రగ్‌ను ఏటీఎస్ స్వాధీనం చేసుకుంది.

పాకిస్థానీ డ్రగ్ డీలర్లు ఈ సరుకును అరేబియా సముద్రం గుండా తమ భారత సహచరులకు పంపినట్లు ఏటీఎస్ పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబరులో, భారతదేశంలో అతిపెద్ద హెరాయిన్ రవాణాలో, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) ప్రపంచ మార్కెట్‌లో రూ. 21,000 కోట్ల విలువైన 3,000 కిలోల డ్రగ్‌ను ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన రెండు కంటైనర్ల నుండి స్వాధీనం చేసుకుంది.