Supreme Court. (Photo Credits: Wikimedia Commons

New Delhi, Feb 19: కుటుంబంలో గృహిణి పాత్ర చాలా ఉన్నతమైనదని, దానికి వెలకట్టలేమని సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆమె సేవలను డబ్బు రూపంలో ఎలా వెల కడతారంటూ ప్రశ్నించింది. ఉత్తరాఖండ్‌లో 2006లో జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ మహిళ కన్నుమూసింది. మృతురాలి కుటుంబానికి రూ.2.5 లక్షల పరిహారం చెల్లించాలని ఆ ప్రమాదానికి కారణమైన వాహన యజమానిని మోటారు ప్రమాద క్లెయిముల ట్రైబ్యునల్‌ ఆదేశించింది.

అయితే ఈ పరిహారం సరిపోదని మరింద ఇప్పించాలని మృతురాలి కుటుంబం ఉత్తరాఖండ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.విచారణలో భాగంగా గృహిణి కాబట్టి అంతకంటే ఎక్కువ పరిహారం ఇప్పించలేమని హైకోర్టు తీర్పును వెలువరించింది. ఈ తీర్పుపై మృతురాలి కుటుంబం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.విచారణలో అత్యున్నత ధర్మాసనం హైకోర్టు వ్యాఖ్యలతో అందులో విభేదించింది. కుటుంబంలో గృహిణి పాత్ర కూడా చాలా కీలకం. గృహహింస చట్టం కింద పెళ్లికాని కూతుళ్లు తల్లిదండ్రుల నుంచి మెయింటెనెన్స్ పొందే హక్కు ఉంది, అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇదిగో..

ఆమె సేవలను డబ్బు రూపంలో కొలవడం కష్టం.రోజుకూలీ స్థాయిలో గృహిణి ఆదాయాన్ని ఎలా లెక్కిస్తారంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. మృతురాలి కుటుంబానికి ఆరు వారాల్లోగా రూ.6 లక్షల పరిహారం చెల్లించాలని వాహన యజమానిని ఆదేశించింది.