(Photo Credits: Flickr)

జూన్ నెల ప్రారంభం అయింది. అనేక రాశుల వారికి ఈ నెల శుభప్రదంగాఉంటుంది. ఈ రోజు అన్ని రాశుల వారిలో అదృష్టం ఏ రాశి వారిని వరిస్తుంది. ఈ గ్రహ స్థానాల మధ్య ఈ రోజు రాశిచక్రంలోని పన్నెండు రాశుల వారికి ఎలా ఉంటుంది. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయో మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో Today Horoscopeలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

మేషం: కార్యక్రమాలలో ఆటంకాలు. ప్రయాణాలు రద్దు. కుటుంబంలో ఒడిదుడుకులు. దేవాలయాల సందర్శనం. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.

వృషభం: వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలలో అనుకూలం. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు.

మిథునం: అనుకున్న ఆదాయం రాక ఇబ్బందులు. మానసిక అశాంతి. ఆరోగ్యభంగం. చర్చల్లో ప్రతిష్ఠంభన. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నిరాశపరుస్తాయి. ఉద్యోగమార్పులు. .

కర్కాటకం: కొత్త విషయాలు గ్రహిస్తారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. దేవాలయాల సందర్శనం.

సింహం: కార్యక్రమాలలో విజయం. అనుకూలత. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఆశాజనకంగా ఉంటుంది.

జూన్‌లో ఈ నాలుగు రాశుల వారు పట్టిందల్లా బంగారమే, ప్రతి పనిలో ఆదాయం పెరుగుతుంది, వ్యాపారం మరింతగా ఊందుకుంటుంది, ఆ నాలుగు రాశులు ఏంటో ఓ సారి తెలుసుకోండి

కన్య: పరిస్థితులు అనుకూలించవు. ఆదాయానికి మించి ఖర్చులు. వ్యవహారాల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. వివాదాలు నెలకొంటాయి.వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

తుల: కుటుంబసభ్యులతో విరోధాలు. శ్రమ పెరుగుతుంది. పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

వృశ్చికం: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులు సహకారం అందిస్తారు. భూ, గృహయోగాలు. నూతన ఉద్యోగాలలో చేరతారు. వ్యాపార, ఉద్యోగాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి.

ధనుస్సు: జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. అనుకున్న రాబడి దక్కుతుంది. వస్తులాభాలు. పాతస్నేహితులను కలుసుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

మకరం: వ్యయప్రయాసలు. ముఖ్యమైన వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగులకు చికాకులు పెరుగుతాయి.

కుంభం: కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. దేవాలయ దర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా మారతాయి.

మీనం: చేపట్టిన కార్యక్రమాలు పూర్తి. సంఘంలో గౌరవమర్యాదలు. ప్రముఖులతో పరిచయాలు. శుభవర్తమానాలు. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.