(Photo Credits: Flickr)

వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గ్రహాలు, నక్షత్రాల కదలిక మొత్తం 12 రాశుల మీద ప్రభావం ఈ రాశుల్లో పుట్టినవారికి కొన్ని రకాల పరిస్థితులు ఎదురవుతాయి. అవి పాజిటివ్ కావచ్చు. లేకుంటే నెగిటివ్ కావచ్చు. గ్రహాల గమనం వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలిగితే.. మరికొన్ని రాశుల వారికి ఇబ్బందులు కలిగిస్తాయి. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం.. జూన్ నెల కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వారిపై లక్ష్మిదేవత అనుగ్రహం ఉంటుంది. లక్ష్మిని సంపదల దేవత అంటారు. ఈ నేపథ్యంలో లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఆయా రాష్ట్రాలకు అదృష్టం కలిసి వస్తుంది. ధనలాభం కలుగుతుంది

మేషం (Aries): లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఆదాయం పెరుగుతుంది. స్నేహితుల సహకారంతో ధనలాభం పొందగవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు. స్థలం మారనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాన్ని పొందుతారు. కొత్త పనులు ప్రారంభించేందుకు ఇది చాలా మంచి సమయం.

మిథునం (Gemini): మీలో కోపం తగ్గుతుంది. ప్రశాంతంగా ఉంటారు. కుటుంబలో ఆనందం, శాంతి ఉంటుంది. స్నేహితుడి సాయంతో వ్యాపారం ఊపందుకుంటుంది. కొత్త వ్యాపారానికి సంబంధించిన కొన్ని ప్రణాళికలు కార్యరూపం దాల్చుతాయి. చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మేధో కార్యకలాపాలు మీకు ఆదాయ వనరుగా మారుతాయి.

ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి, అంతా గందరగోళంగా ఉంటుంది, నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం

వృశ్చికం (Scorpio): మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. విద్యా సంబంధ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపార పరిస్థితులు మెరుగుపడతాయి. కుటుంబంలో ఆనందం, శాంతి ఉంటుంది. ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. దుస్తులను బహుమతిగా అందుకునే అవకాశముంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

మీనం (Pisces): మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధన లాభం కలుగుతుంది. డబ్బుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తండ్రి సహకారంతో ఇంట్లో ఆనందం పెరుగుతుంది. చదవాలి, నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. ఉన్నతాధికారులతో సత్సంబంధాలు కొనసాగించడం వల్ల ప్రయోజనాలు పొందుతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.