
వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, పెళ్లి ఏదైనా సరే ముందుగా రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఆలోచిస్తారు. ఈ రోజు తమ రాశి ఫలం ఎలా ఉందో చెక్ చేసుకుంటూ ఉంటారు. నేటి రాశి ఫలాల విషయానికి వస్తే.. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి శు.పాడ్యమి సా.5.14 వరకు, తదుపరి విదియ నక్షత్రం రోహిణి ఉ.8.39 వరకు, తదుపరి మృగశిర, వర్జ్యం ప.2.50 నుండి 4.36 వరకు, దుర్ముహూర్తం ఉ.8.04 నుండి 8.54 వరకు తదుపరి రా.10.49 నుండి 11.34 వరకు అమృతఘడియలు...రా.1.26 నుండి 3.13 వరకు ఉంటుంది.
మేషం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. మనశ్శాంతి లోపిస్తుంది. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి. వ్యాపారులకు లాభాలు అనుమానమే. అనారోగ్య సూచనలు..
వృషభం: అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. భూవివాదాల పరిష్కారం. వాహనయోగం. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.
మిథునం: అదనపు ఖర్చులు . దూరప్రయాణాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కార్యక్రమాలు ముందుకు సాగవు. వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.
కర్కాటకం: పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. ఉద్యోగులకు ఊహించని ఇంక్రిమెంట్లు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ధనలాభం.
సింహం:నూతన వరిచయాలు. శుభకార్యాల నిర్వహణ. వాహనయోగం. ఉద్యోగులకు శుభవార్తలు. వ్యాపారులు పెట్టుబడులు అందుకుంటారు. దేవాలయ దర్శనాలు. విందువినోదాలు.
కన్య: బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. ముఖ్య కార్యక్రమాల్లో ఆటంకాలు. ఉద్యోగాలలో చికాకులు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. దేవాలయాల సందర్శనం. విద్యార్థుల ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి.
తుల: ఆదాయానికి మించి ఖర్చులు. దేవాలయ దర్శనాలు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. వ్యాపారులు కొంత నిదానం పాటించాలి. కుటుంబసమస్యలు. శారీరక రుగ్మతలు.
వృశ్చికం: చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. దేవాలయ దర్శనాలు. విందువినోదాలు.సోదరులతో వివాదాలు తీరతాయి. వ్యాపారులకు లాభాలు తథ్యం. ఉద్యోగాల్లో నూతనోత్సాహం.
ధనుస్సు: కొత్త ఆశలు చిగురిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారులకు నూతన పెట్టుబడులు. ఉద్యోగులకు ఆశాజనకంగా ఉంటుంది.
మకరం: కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యసమస్యలు. కార్యక్రమాలలో అవాంతరాలు. ఆదాయం తగ్గుతుంది. దూరప్రయాణాలు. వ్యాపారులకు కొన్ని సమస్యలు. ఉద్యోగులకు అనుకోని మార్పులు. .
కుంభం: కార్యక్రమాలలో ఆటంకాలు. బంధువులతో విభేదాలు. వ్యాపారులు లాభాలు దక్కక డీలా పడతారు. ఉద్యోగులకు విధుల్లో సమస్యలు. ఆరోగ్య, కుటుంబ సమస్యలు.
మీనం: ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి. బంధువుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధనలబ్ధి. చిన్ననాటి స్నేహితుల నుంచి ఆహ్వానాలు. ఉద్యోగులకు ప్రయత్నాలు సఫలం. వ్యాపారులకు కొత్త ఆశలు.