Representational image (photo credit- File image )

Mumbai, NOV 03: ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో (Zomato Discounts) ఇచ్చే ఆఫర్ల గురించి సంస్థ సీఈఓ దీపిందర్ గోయల్ (Deepinder Goyal) సంచలన విషయం ప్రకటించారు. జొమాటో ప్రకటించిన ఆఫర్లకు, ఆచరణలో వచ్చే డిస్కౌంట్‌కు చాలా తేడా ఉంటుంది. ఆఫర్ల ప్రకటన, అమలులో వ్యత్యాసం నిజమేనని చెప్పారు. కానీ అందుకు కారణాలు కూడా బయట పెట్టారు. ఇతర యాప్ లతో పోటీ వల్లే తాము డిస్కౌంట్లు చూపాల్సి వస్తుందని రణబీర్ అనే యూ-ట్యూబర్ నిర్వహించిన పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ దీపిందర్ గోయల్ తెలిపారు. ఇలా డిస్కౌంట్లు చూపడం, కస్టమర్లను తప్పుదోవ పట్టించడమే అవుతుందన్నారు. ఈ విధానాన్ని మార్చాలనుకుంటున్నట్లు చెప్పారు.

PNB & Fedaral Bank Fined: రెండు బ్యాంకులకు భారీ షాక్ ఇచ్చిన ఆర్బీఐ, నిబందనలు ఉల్లంఘించినందుకు జరిమానా 

ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ఓపెన్ చేస్తే 20-50 శాతం మధ్య డిస్కౌంట్లు ఊరిస్తూ ఉంటాయి. కానీ, బుక్ చేసిన తర్వాత తక్కువ డిస్కౌంట్ వస్తుందని యూజర్లకు అర్థమవుతూ ఉంటుంది. జొమాటో ఇచ్చే డిస్కౌంట్లు అంత పెద్దవి కాదని, కానీ అలా కనిపిస్తాయన్నారు దీపిందర్ గోయల్ (Deepinder Goyal). 50 శాతం డిస్కౌంట్ అని ఉన్నా ఉదాహరణకు రూ.400 ఆర్డర్ పెడితే 50 శాతం డిస్కౌంట్ చూపుతుంది. కానీ రూ.80 మాత్రమే తగ్గుతుంది.. దీని ప్రకారం 20 శాతం డిస్కౌంట్ (Zomato Discounts) మాత్రమే ఇస్తున్నట్లవుతుందని దీపిందర్ గోయల్ చెప్పారు. ఈ తరహా డిస్కౌంట్లలో నిజాయితీ ఉందని తాను చెప్పబోనన్నారు.