PNB & Fedaral Bank Fined (PIC@ FB, Wikimedia commons)

Mumbai, NOV 03: నిబంధనలు ఉల్లంఘించిన రెండు బ్యాంకులు, రెండు ఫైనాన్స్ సంస్థలపై కేంద్రీయ బ్యాంక్ ‘ఆర్బీఐ’ (RBI) కొరడా ఝుళిపించింది. కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), ప్రైవేట్ రంగ బ్యాంక్.. ఫెడరల్ బ్యాంక్ (Federal bank) సహా మరో రెండు ఫైనాన్స్ సంస్థలపై భారీ జరిమానా విధించింది. వడ్డీరేట్లతోపాటు బ్యాంకుల్లో కస్టమర్ సర్వీసు నిబంధనలు పాటించడంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) విఫలమైంది. కేవైసీ నిబంధనల అమలును ఫెడరల్ బ్యాంక్ ఉల్లంఘించింది. మెర్సిడెజ్-బెంజ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇండియా సైతం కేవైసీ, ఎన్బీఎఫ్సీ నిబంధనలను కొసమట్టం ఫైనాన్స్ లిమిటెడ్ ఉల్లంఘించాయి.

Supreme Court Judge: నన్ను మై లార్డ్‌ అని పిలవడం మానేసి సర్ అని పిలిస్తే నా సగ జీతం ఇస్తా, న్యాయవాదికి ఆఫర్ ఇచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి 

దీంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (RBI) పై రూ.72 లక్షలు, ఫెడరల్ బ్యాంక్ మీద రూ.30 లక్షలు, మెర్సిడెజ్ బెంజ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ మీద రూ.10 లక్షలు, కొసమట్టం ఫైనాన్సియల్ లిమిటెడ్ మీద రూ.13.38 లక్షల పెనాల్టీ విధించింది.