Arvind Kejriwal

New Delhi, May 31: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి(CM Arvind Kejriwal) సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు జూన్ 2తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన తిహార్ జైల్లో పోలీసులకు తిరిగి లొంగిపోనున్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ఎమోషనల్ అయ్యారు.. "నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుంది. ధర్మాసనం ఇచ్చిన బెయిల్ గడువు ఎల్లుండితో ముగిసిపోతుంది.

తిరిగి పోలీసులకు లొంగిపోతున్నా. ఈసారి నన్ను ఎన్ని రోజులు జైల్లో ఉంచుతారో తెలీదు. నన్ను మాట్లాడనివ్వకుండా భయపెట్టడానికి అనేక విధాలుగా ప్రయత్నించారు. నేను జైలులో ఉన్నప్పుడు నాకు మెడిసిన్స్ ఇవ్వలేదు. 20 ఏళ్లుగా డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్నాను. 10 ఏళ్లుగా ఇన్సులిన్ తీసుకుంటున్నాను. రోజు నా పొట్ట భాగంలో 4 సార్లు ఇంజక్షన్ తీసుకుంటాను.  అరవింద్‌ కేజ్రీవాల్‌ బెయిల్‌ పొడిగింపు అభ్యర్థనపై షాకిచ్చిన సుప్రీంకోర్టు, బెయిల్ పొడిగింపు పిటిషన్‌ విచారణకు నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం

జైల్లో నాకు ఇన్సులిన్ ఇంజక్షన్ ఇవ్వలేదు.దీంతో షుగర్ లెవల్స్ 300-325 వరకు వెళ్లాయి. షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటే కిడ్నీ, లివర్ దెబ్బతింటాయి. వీళ్లు నా నుంచి ఏం కోరుకుంటున్నారో అర్థం కావడం లేదు. జైల్లో 50 రోజులు ఉన్నాను. నేను జైలుకు వెళ్లినప్పుడు 70 కిలోలు ఉన్న నా బరువు నేడు 64 కిలోలు. జైలు నుంచి విడుదలయ్యాక కూడా బరువు పెరగడం లేదు. ఇది శరీరంలో ఏదైనా తీవ్రమైన వ్యాధికి సంకేతంగా కూడా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

Here's Video

6 కేజీల బరువు తగ్గాను. మళ్ళీ బరువు పెరగడం లేదు. శరీరంలో ఇతర ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చి ఉండొచ్చు. పరీక్షలు చేయాలని వైద్యులు చెబుతున్నారు. యూరిన్ లో కీటోన్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయి . ఢిల్లీ ప్రజలు సంతోషంగా ఉంటే కేజ్రీవాల్ సంతోషంగా ఉంటాడు. నేను మీ మధ్య లేకపోయినా అన్ని పనులు జరుగుతాయి. అన్ని సంక్షేమ పథకాలు కొనసాగుతాయి" అని కేజ్రీ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.

ఈసారి వాళ్ళు నన్ను మరింత హింసించే అవకాశం ఉంది, కానీ నేను తలవంచను ... నేను లోపల లేదా బయట ఎక్కడ నివసించినా. ఢిల్లీ పని ఆగిపోనివ్వను. మీ ఉచిత విద్యుత్, మొహల్లా క్లినిక్‌లు, ఆసుపత్రులు, ఉచిత మందులు, చికిత్స, 24 గంటల విద్యుత్, అనేక ఇతర అంశాలు కొనసాగుతాయి. తిరిగి వచ్చిన తర్వాత నేను ప్రతి తల్లి, సోదరికి ప్రతి నెలా రూ. 1000 ఇవ్వడం ప్రారంభిస్తాను.

ఈ రోజు నేను నా కుటుంబం కోసం మీ నుండి ఒక విషయం అడగాలనుకుంటున్నాను. నా తల్లిదండ్రులు చాలా పెద్దవారు. మా అమ్మ చాలా అనారోగ్యంతో ఉంది. జైలులో ఉన్న నేను ఆమె గురించి చాలా ఆందోళన చెందుతున్నాను. నా తర్వాత నా తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి, వారి కోసం ప్రార్థించండి అంటూ ఒక్కసారిగా ఎమోషన్ అయ్యారు. జూన్ 2న తిరిగి జైలుకు వెళ్లినప్పుడు తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.