IIT Madras put under lockdown (Photo Credits: PTI)

Chennai, December 14: తమిళనాడు రాజధాని చెన్నై ఐఐటీ ‍ క్యాంపస్‌లో కరోనావైరస్ కలకలం రేపింది. భారతదేశపు ప్రధాన విద్యా సంస్థ అయిన చెన్నై ఐఐటీ క్యాంపస్‌లో (IIT Madras) ఒక‍్కసారిగా 71 మందికి కరోనా బారినపడ్డారు. ఇందులో 66 మంది విద్యార్థులు, 5 మంది అధ్యాపకులు ఉన్నారని ఐఐటీ అధికారులు తెలిపారు. కేవలం ఒక్కరోజులోనే 32 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయని క్యాంపస్ అధికారులు తెలిపారు.

ఇప్పటి వరకు 444 నమూనాలను పరిశీలించగా 71 మంది వైరస్‌కు పాజిటివ్‌గా (71 New Cases Over Two Weeks) పరీక్షించారని పేర్కొన్నారు. డిసెంబర్‌ 1 నుంచి 12 వరకు ఇనిస్టిట్యూట్‌ విద్యార్థులు పాజిటివ్‌గా పరీక్షించగా.. సోమవారం ఒకే రోజు 32 కేసులు వెలుగు చూశాయి. సీఎం పళనిస్వామి ఆదేశాల మేరకు కింగ్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంట్‌ మెడిసిన్‌ అండ్‌ రీసెర్చ్‌లో చికిత్స పొందుతున్నారని, వారంతా బాగానే ఉన్నారని రాధాకృష్ణ తెలిపారు.

ఇనిస్టిట్యూట్‌ ప్రతినిధి మాట్లాడుతూ అన్ని విభాగాలు, ప్రయోగశాలలు మూసివేశామని (IIT Madras Put Under Lockdown), ప్రస్తుతం 700 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని, ఎక్కువగా రీసెర్చ్‌ స్కాలర్స్‌ తొమ్మిది హాస్టళ్లలో ఉన్నారని తెలిపారు. తరగతులు ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయని పేర్కొన్నారు. కొవిడ్‌ పాజిటివిటీ రేటు 20శాతం ఉందని, ప్రోటోకాల్‌ ప్రకారం వేగంగా పరీక్షలు నిర్వహిస్తున్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

కరోనాతో కంటి చూపుకు ముప్పు, ఊపిరితిత్తుల్లోని కణాలపై కోవిడ్ దాడి, వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా జాగ్రత్తలు తప్పనిసరి, దేశంలో తాజాగా 27 వేల కేసులు నమోదు, కరోనా భయంతో కేరళలో ఆలయం మూసివేత

వచ్చే రెండు రోజుల్లో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున క్యాంపస్‌లోని విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహించాలని తమిళనాడు ప్రభుత్వం ఇనిస్టిట్యూట్‌కు సూచించింది. యూనివర్సిటీలో 774 మంది విద్యార్థులున్నారు. ప్రస్తుతం క్యాంపస్‌లో మళ్లీ లాక్‌డౌన్ నిబంధనలను అమలులోకి తెచ్చామని, అన్ని డిపార్టుమెంట్లను మూసివేస్తున్నట్లు తెలిపారు. ఐఐటీ చెన్నై ఆదివారం జారీ చేసిన అధికారిక సర్క్యులర్ ప్రకారం కోవిడ్ కేసులు పెరిగిన దృష్ట్యా, తదుపరి నోటీసులిచ్చే వరకు అన్ని విభాగాలు, కేంద్రాలు, లైబ్రరీని వెంటనే మూసివేయాలని నిర్ణయించారు.

అధ్యాపకులు, సిబ్బంది, ప్రాజెక్ట్ సిబ్బంది, పరిశోధకుల తదితరులు ఇంటి నుండే పని చేస్తారు. క్యాంపస్‌లో బస చేసే విద్యార్థులు, ప్రాజెక్ట్ సిబ్బంది అందరూ తమ హాస్టల్ గదులకు మాత్రమే పరిమితం కావాలి. భౌతిక దూరం, ఫేస్‌మాస్క్‌ లాంటి నిబంధనలు కచ్చితంగా పాటించాలి. కోవిడ్ (జ్వరం, పొడి దగ్గు, గొంతు నొప్పి, విరేచనాలు, రుచి /వాసన కోల్పోవడం లేదా తదితర) లక్షణాలు కనిపించినవారు తక్షణమే అధికారులను సంప్రదించాలని సర్క్యులర్‌లో పేర్కొంది.