Mumbai, June 16: ఇళ్లలో దాచుకున్న పలు రకాల వస్తువులను ఎలుకలు (Rats) తీసుకెళ్తుంటాయి.. ఇక డబ్బుల నోట్లు వాటి కంటపడితే కొరక్కు తిని ఎందుకూ ఉపయోగం లేకుండా చేస్తాయి. ఇలాంటి ఘటనలు అనేక సార్లు వినేఉంటాం. కానీ ముంబయిలోని(Mumbai) ఎలుకలు (rats) పెద్ద సాహసమే చేశాయి. సుమారు రూ. 5లక్షల విలువైన బంగారాన్ని దొంగతనం (Theft) చేశాయి. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు విచారణ సైతం చేపట్టారు. చివరికి ఓ మురుగు కాల్వలో బంగారంతో (Gold) ఉన్న సంచి దొరకడంతో బాధితురాలు ఊపిరిపీల్చుకున్నారు. దీంతో అసలు వీటిని ఎవరు మురికి కాల్వలో వేశారని సీసీ కెమెరాల్లో (CC Cameras) చూడగా అసలు విషయం వెలుగులోకి రావటంతో పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో (Mumbai) ఈ ఘటన వెలుగు చూసింది.
Maharashtra: 10 tola gold worth Rs 5 lakhs recovered from clutches of rats in a gutter near Gokuldham Colony, Mumbai
A woman on her way to deposit jewellery in a bank gave it away to children on street, mistaking it to be bread; children threw it into garbage dump...:SI C Gharge pic.twitter.com/Vj7uxaUJdk
— ANI (@ANI) June 16, 2022
గోరేగావ్ లోని గోకుల్ ధామ్ కాలనీలో పనిచేసే సుందరి పల్నిబేల్ తన కుమార్తె పెళ్లి అప్పు తీర్చేందుకు 10తులాల బంగారు ఆభరణాలను తనఖా పెట్టేందుకు బ్యాంకుకు వెళ్తుంది. మధ్యలో వడాపావ్ (Vadapav) ఉన్న ఓ కవర్ ను ఓ చిన్నారికి అందజేసింది. ఆ సంచిలోనే బంగారు ఆభరణాలు ఉన్నట్లు ఆమె గుర్తించలేదు. తీరా బ్యాంకుకు వెళ్లి చూసుకోగా బంగారం కనిపించలేదు. తిరిగి ఆ చిన్నారి ఉన్న ప్రదేశానికి వెళ్లి చూడగా కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణ చేపట్టారు.
ఎట్టకేలకు చిన్నారి, ఆమె తల్లిని గుర్తించి బంగారం దొరికిందా అని ఆరా తీశారు. తాము పడాపాయ్ ఎండిపోవటంతో చెత్తకుప్పలో వేశామని తెలిపారు. అక్కడికి వెళ్లి చూడగా కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ పుటేజీలను పరిశీలించడంతో అసలు విషయం తెలుసుకొని పోలీసులు, బాధితురాలు ఆశ్చర్య పోయారు. చెత్తకుప్పలో పడిన బంగారం సంచిని ఎలుకలు తీసుకెళ్లడం గమనించారు.
అవి కొద్దిదూరం బంగారం సంచిని తీసుకెళ్లి మురుగు కాల్వలో వదిలేశాయి. దీంతో అక్కడ వెతికించగా బంగారం ఉంచిన సంచిని గుర్తించారు. దానిని పోలీసులు బాధితురాలికి అందజేశారు.