Lucknow December 18: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ(Uttarpradesh Assembly) ఎన్నికల ముందు ఎస్పీ నేతల ఇండ్లలో ఐటీ దాడులు(IT Rides) కలకలం సృష్టిస్తున్నాయి. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) సన్నిహతులకు చెందిన ఇండ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఎస్పీ నేత నేత రాజీవ్ రాయ్(Rajeev Roy) ఇంటితో పాటూ మిగిలిన ప్రాంతాల్లోని ఆయన కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయనతో పాటూ ఆర్‌సీఎల్ ప్రమోటర్ మనోజ్ యాదవ్(Manoj Yadav) ఇంట్లో కూడా సెర్చ్ జరుగుతోంది.
Mau: An Income Tax raid is underway at the residence of national secretary of Samajwadi Party (SP), Rajeev Rai.
Raids are underway at a few more locations at the premises of people of SP chief Akhilesh Yadav. More details are awaited. pic.twitter.com/yJIDwC75qF
— ANI UP (@ANINewsUP) December 18, 2021
మవులోని రాజీవ్ రాయ్(Manoj Yadav) ఇంట్లో కూడా ఐటీ దాడుల సమయంలో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజీన్ అనుచరులు ఆయన ఇంటివద్దకు భారీగా చేరుకున్నారు. తనకు ఎటువంటి నేరచరిత్ర లేదని, తన వద్ద నల్లధనం కూడా లేదని రాజీవ్ రాయ్ అన్నారు. ప్రజలకు హెల్ప్ చేస్తుంటానని, కానీ ప్రభుత్వానికి ఇది నచ్చడం లేదన్నారు. దాని వల్లే ఇలా ఐటీ దాడులు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
తన అనుచరులంతా సంయమనం పాటించాలని, మీరేదైనా చేస్తే, వాళ్లు వీడియో చేసి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి, ఓ కేసులో అన్యాయంగా ఇరికిస్తారని రాయ్ ఆరోపించారు. మరికొద్ది రోజుల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి.