New Delhi November 28: భారత్‌లో(India) కరోనా తీవ్రత(Coronavirus) క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 8,774 కరోనా కేసులు (Covid-19) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,72,523కు చేరాయి. ఇందులో 3,39,98,278 మంది కరోనా నుంచి కోలుకోగా 1,05,691 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,68,554 మంది మహమ్మారి వల్ల మరణించారు. దేశంలో యాక్టివ్ కేసులు 543 రోజుల కనిష్టానికి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ(Ministry of Health) తెలిపింది. ఇక గత 24 గంటల్లో మరో 9,481 మంది కరోనా నుంచి కోలుకోగా, 543 మంది మృతిచెందారని ప్రకటించింది.
కొత్తగా నమోదైన కేసుల్లో సగానికిపైగా కేరళలోనే(Kerala) ఉన్నాయి. అక్కడ శనివారం 4,741 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 98.34 శాతంగా ఉందని, మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల(Active Cases) సంఖ్య 0.31 శాతం మాత్రమేనని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇక ఒమిక్రాన్(Omicron) వేరియంట్ విజృంభణతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల్లో స్ర్రీనింగ్ ను కట్టుదిట్టం చేశారు. విదేశాల నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్(RTPCR) టెస్టు తప్పనిసరి చేశారు. అనుమానితులను 14 రోజుల పాటూ క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ కూడా ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు సూచనలు పంపిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ పట్ల అప్రమత్తం చేస్తోంది. ప్రజలు ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా, కోవిడ్ నిబంధనలను పాటించాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు.