IAF Chief AP Singh (Photo Credits: X/@ANI)

భారత వైమానిక దళం “ఆపరేషన్ సింధూర్”లో ఘన విజయాన్ని సాధించినట్లు ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో భారత యుద్ధ విమానాలు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయడం జరిగింది. ముఖ్యంగా, అమెరికా తయారీ ఎఫ్‌-16, చైనా తయారీ జే-17 యుద్ధ విమానాలను ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు.

పెహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో.. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడానికి ఆపరేషన్ సింధూర్ ని కేంద్రం చేపట్టింది. పాకిస్థాన్ వైమానిక దళం భారత యుద్ధ విమానాలను కూల్చినట్లు చేసే ఆరోపణలను ఎయిర్ ఫోర్స్ చీఫ్ పూర్తిగా ఖండించారు. తమ దేశ ప్రజలు తప్పుదారి పట్టకుండా జాగ్రత్తగా ఉంచడానికి పాక్ ఆ ప్రసారం చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

నెత్తురోడిన దేవరగట్టు బన్నీ ఉత్సవం, కర్రలతో తీవ్రంగా కొట్టుకున్న భక్తులు.. ఇద్దరు మృతి, 100మందికి పైగా గాయాలు, వీడియోలు ఇవిగో..

మార్షల్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఆపరేషన్ ద్వారా సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్లను ధ్వంసం చేశారు. పాకిస్థాన్ ఆపై కాల్పుల విరామం కోరింది. భారత రక్షణ వ్యవస్థ సుమారు 100 గంటల ఉత్కంఠభరిత సమయంలో పాకిస్థానీ మిస్సైళ్లు, డ్రోన్లను సమర్థవంతంగా ఎదుర్కొంది. ఆపరేషన్‌లో పాకిస్థాన్‌లోని అనేక ఎయిర్‌ఫీల్డ్లు, రన్‌వేలు, రేడార్‌లు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు ధ్వంసమయ్యాయి.

India Destroyed 4-5 Pakistani Fighter Jets, Most Likely F-16s,

మూడు వేర్వేరు ఎయిర్‌ఫీల్డ్ స్టేషన్లలో హ్యాంగర్‌లు కూడా నాశనం అయ్యాయి. సీ-130 క్లాస్ విమానం, నాలుగైదు యుద్ధ విమానాలు, వీటిలో ఎఫ్‌-16లు కూడా ధ్వంసమయ్యాయని ఆయన వెల్లడించారు. పాక్‌లో ఉన్న ఓ ఎస్ఏఎమ్ సిస్టమ్ కూడా నాశనం చేయబడింది.ఈ ఆపరేషన్ విజయాన్ని ప్రపంచం ప్రత్యక్షంగా చూసిందని, భారత వైమానిక దళం తమ లక్ష్యాలను విజయవంతంగా సాధించిందని అమర్ ప్రీత్ సింగ్ చెప్పారు. భవిష్యత్తులో యుద్ధ విధానం మారిపోతుందని, కొత్త సైనిక సవాళ్లకు తగిన ప్రిపరేషన్ అవసరమని తెలిపారు.