Devaragattu Bunny Festival in Andhra Pradesh (photo-Video Grab)

కర్నూలు(Kurnool) జిల్లాహొళగుంద మండలం దేవరగట్టు(devaragattu) మాళ మల్లేశ్వరస్వామి బన్నీ ఉత్సవంలో తీవ్ర అపశృతి చోటుచేసుకుంది. బన్నీ ఉత్సవాల ప్రారంభంలోనే రెండు వర్గాలు కర్రలతో తలపడటంతో ఇద్దరు భక్తులు మృతి చెందారు. దాదాపు వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. దేవరగట్టులో గురువారం అర్ధరాత్రి స్వామి, అమ్మవారి వివాహం అనంతరం ఊరేగింపు జరిగింది.

దేవతామూర్తులను తీసుకెళ్లేందుకు రెండు వర్గాలు కర్రలతో పోటీ పడ్డాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల వారు కర్రలతో దాడులు చేసుకోగా.. ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 100 మందికి పైగా గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆదోని ఆస్పత్రికి తరలించారు. దేవరగట్టులో ఉత్సవాలు కొనసాగుతున్నాయి.

షాకింగ్ వీడియో ఇదిగో, ఆరెస్సెస్ శతాబ్ది ఉత్సవాల్లో డ్రమ్స్ వాయిస్తూ కుప్పకూలి పడిపోయిన కార్యకర్త, చికిత్స పొందుతూ మృతి

దేవరగట్టులో బన్ని ఉత్సవం ప్రతి ఏటా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా దేవతామూర్తులను కాపాడేందుకు మూడు గ్రామాల భక్తులు ఒకవైపు, ఏడు గ్రామాల భక్తులు మరోవైపు నిలబడి కర్రలతో కొట్టుకుంటారు.

2 Killed, 100 Injured in Traditional Stick Fight During Dussehra Celebrations in Kurnool 

ఈ కర్రల సమరాన్ని చూసేందుకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు తరలివస్తుంటారు. బన్నీ ఉత్సవం సందర్భంగా దేవతామూర్తులను కాపాడటానికి భక్తులు కర్రలతో కొట్టుకోవడం అక్కడ సాంప్రదాయంగా వస్తోంది.