Coronavirus | Representational Image | (Photo Credits: Pixabay)

Chennai, May 21: ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA.4 (Omicron) కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో (Hyderabad) ఈ కొత్త వేరియంట్ తొలికేసు నమోదు కాగా....తమిళనాడులో (Tamil Nadu) రెండో కేసు బయటపడింది. ఈ మేరకు తమిళనాడు హెల్త్ మినిస్టర్ సుబ్రమణియన్ ప్రకటన చేశారు. చెంగల్పట్టు జిల్లాలోని చెనైయాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నవాలూర్ గ్రామానికి చెందిన వ్యక్తికి పాజిటివ్ వచ్చినట్లు తేలింది. శుక్రవారంనాడు హైదరాబాద్ లో తొలి BA.4 ఒమిక్రాన్ సబ్ వేరియంట్ నమోదైంది. దీంతో అతని కాంటాక్ట్ లను ట్రేస్ చేయగా...తమిళనాడుకు చెందిన వ్యక్తికి కూడా ఈ వేరియంట్ నిర్ధారణ అయింది. అతనికి ఎలాంటి లక్షణాలు లేవని, అయినప్పటికీ కరోనా టెస్టుల్లో పాజిటివ్‌గా తేలింది. దీంతో అతన్ని ఐసోలేషన్‌కు (Isolaton) తరలించారు. మిగిలిన కాంటాక్ట్ లను కూడా టెస్టు చేస్తున్నారు.

BA.4 Omicron Variant: హైదరాబాద్‌లో ఒమిక్రాన్‌ ఉప వేరియెంట్‌ బీఏ.4 కలకలం, ఈ నెల 9వ తేదీన ఈ కేసు నమోదు అయిందని తెలిపిన INSACOG 

ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) ఇదే కేసుపై బులెటిన్‌ను విడుదల చేసింది. BA.4 వేరియంట్‌ను మొదటిసారిగా జనవరి 10, 2022న దక్షిణాఫ్రికాలో కనుగొన్నారు. అప్పటి నుండి, అన్ని దక్షిణాఫ్రికా ప్రావిన్సులలో ఒకొక్కటిగా బయటపడింది.