Hyd, May20: భారత్‌లో తొలి ఒమిక్రాన్ ఉప వేరియెంట్ బీఏ.4 కేసు తెలంగాణలో హైదరాబాద్‌లో నమోదు అయ్యింది. ఈ మేరకు ఇండియన్ సార్స్ కోవ్-2 కన్షార్షియం ఆన్ జీనోమిక్స్ ( INSACOG) ధృవీకరించింది. కోవిడ్-19 జెనోమిక్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. ఈ నెల 9వ తేదీన ఈ కేసు (BA.4 Omicron Variant) నమోదు అయ్యిందని, ఆఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి శాంపిల్‌లో ఈ సబ్‌వేరియెంట్ వెలుగు చూసిందని ఇన్సాకాగ్ వెల్లడించింది.
దక్షిణాఫ్రికాతో పాటు చాలా దేశాల్లో కరోనా కేసులు విజృంభణకు కారణమైంది ఈ ఒమిక్రాన్ సబ్‌వేరియెంట్. ఈ తరుణంలో.. తొలి కేసు వెలుగు చూడడంతో.. భారత వైద్య పరిశోధన మండలి ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాబోయే రోజుల్లో కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. దేశంలో కొత్తగా 2259 కరోనా కేసులు, ఇందులో 15,044 కేసులు, గత 24 గంటల్లో 20 మంది మృతి
ఇదిలా ఉంటే.. ఒమిక్రాన్‌లోని రెండు సబ్ వేరియెంట్‌లలో బీఏ.4 కూడా ఒకటి. ఇది ఆస్పత్రిపాలు అయ్యేంత ప్రమాదకరమైంది కాకపోయినా.. వ్యాప్తి మాత్రం అధికంగా ఉంటుంది. పైగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు కూడా ఇది సోకుతోంది. తీవ్ర ముప్పు లేనప్పటికీ.. కేసులు సంఖ్య పెరగవచ్చని మాత్రం వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ వేరియెంట్ సోకిన వాళ్లలో అలసట, జలుబు, జ్వరం, దగ్గు, శ్వాసపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి అయితే వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉన్నవాళ్లు, ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లపై దీని ప్రభావం ప్రతికూలంగా చూపించడం చాలా దేశాల కేసుల్లో గుర్తించారు.