దేశంలో కొత్తగా 2259 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,31,29,563కు చేరాయి. ఇందులో 15,044 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 5,24,323 మంది మరణించారు. ఇప్పటివరకు 4,25,92,455 మంది కోలుకున్నారు. కాగా, గత 24 గంటల్లో 2641 మంది మహమ్మారినుంచి బయటపడగా, 20 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.రోజువారీ పాజిటివిటీ రేటు 0.50 శాతానికి చేరిందని, యాక్టివ్ కేసులు 0.04 శాతం ఉన్నాయని తెలిపింది. ఇక రికవరీ రేటు 98.75 శాతం, మరణాలు 1.22 శాతంగా ఉన్నాయని వెల్లడించింది. ఇప్పటివరకు 1,91,96,32,518 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని, నిన్న ఒక్కరోజే 15,12,766 మందికి వ్యాక్సినేషన్ చేశామని పేర్కొన్నది.
COVID19 | 2,259 new cases recorded in India in the last 24 hours; Active caseload at 15,044 pic.twitter.com/VHqGXmwVRG
— ANI (@ANI) May 20, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)