Coronavirus Outbreak in Telangana. Representational Image. | Pixabay Pic

New Delhi, May 24: భారతదేశంలో ఒకరోజును మించి మరుసటి రోజు అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 6,767 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో ఒకరోజులో ఇంత పెద్దమొత్తంలో కేసులు రావడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య ఆదివారం ఉదయం నాటికి 1,31,868 కు చేరింది. నిన్న ఒక్కరోజే 147 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3,867 కు పెరిగింది.

నిన్న దేశవ్యాప్తంగా 2657 మంది కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 54,440 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 73,560 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

COVID19 India Tracker: 

మహారాష్ట్రలో కరోనావైరస్ వ్యాప్తి అత్యంత తీవ్రంగా ఉంది. ఇక్కడ ఇప్పటివరకుపాజిటివ్ గా నిర్ధారింపబడిన కేసులు 50 వేలకు చేరువయ్యాయి. శనివారం ఒకే రోజులోనే 60 మంది మరణించారు మరియు 2,608 మంది వైరస్ సోకినవారు ఉన్నారు. మహారాష్ట్ర మరణాల సంఖ్య 1,577 కు చేరుకోగా,  మొత్తం COVID-19 రోగుల సంఖ్య 47,190 కు చేరుకుంది. మొత్తం కేసులలో 32,201 ఆక్టివ్ కేసులు  ఉన్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా, మొత్తం COVID-19 కేసుల సంఖ్య 5.3 మిలియన్లకు దాటింది, మరణాల సంఖ్య కూడా 342,000 పైగా నమోదయ్యాయని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది. ఆదివారం ఉదయం నాటికి ప్రపంచవ్యాప్తంగా నమోఫైన మొత్తం COVID-19 కేసుల 5,309,698 కాగా, మరణాల సంఖ్య 342,078 గా ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా 1,622,605 పాజిటివ్ కేసులు మరియు 97,087 కరోనా మరణాలతో అగ్రరాజ్యం అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది.